బాబు ఆరోపణలకు సజ్జల కౌంటర్‌ | Sajjala Ramakrishna Reddy Reacts On CBN Arrest | Sakshi
Sakshi News home page

స్కామ్‌లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు: చంద్రబాబు ఆరోపణలపై సజ్జల

Published Sat, Sep 9 2023 9:19 AM | Last Updated on Sat, Sep 9 2023 1:40 PM

Sajjala Ramakrishna Reddy Reacts On CBN Arrest  - Sakshi

సాక్షి, గుంటూరు: ఎలాంటి దురుద్దేశాలు లకుండా పాదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యాక.. రాజకీయ దురుద్దేశాలతోనే తనను అరెస్ట్‌ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై సజ్జల స్పందించారు. 

ఎఫ్‌ఐఆర్‌ లేదు.. నోటీసులు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అన్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్‌ గురించి ఆయన మాట్లడుతున్నారు.  ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదంటూ దబాయిస్తున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.  కానీ, ఈ కేసు చాలా బలంగా ఉంది. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్‌ఆఐర్‌ నమోదు అయ్యిది.  

2021 డిసెంబర్‌లో(9-12-2021) సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కానీ,  2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం..  రూ.241 కోట్లు డైవర్ట్‌ అయ్యిందని బయటపెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ కంటే ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్‌ బయటపడింది. స్కాంలో అప్పటి సీఎం పాత్ర ఉందనే బలమైన సాక్ష్యాలు సీఐడీ దగ్గర ఉన్నాయి.  షెల్‌ కంపెనీల ద్వారా నిధులు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎఫ్‌ఐఆర్‌కు ముందే స్కామ్‌ బయటపడింది. తేదీ లేని ఎంవోయూ కుదర్చుకున్నారు.  జీవో ప్రకారం ఏదీ జరగలేదు.. అన్నీ పక్కకు పెట్టారు. ఇది 100 శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కాం అయిపోయింది. ఎంవోయూ అయ్యాక ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నోట్‌ఫైల్స్‌లో కూడా అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిజైన్‌టెక్‌ ద్వారా హవాలా డబ్బు టీడీపీ వాళ్ల ఖాతాల్లోకి వెళ్లిందని సీఐడీ గుర్తించింది.  చంద్రబాబు ఆదేశాల ప్రకారమే స్కాం జరిగిందని గుర్తించి ఆధారాలు చూపించి మరీ దర్యాప్తు చేస్తోంది సీఐడీ. 2018లోనే విజిల్‌ బ్లోయర్‌ ద్వారా స్కామ్‌ బయటపడింది. చాలా రాష్ట్రాల్లో ఈ స్కామ్‌పై ఏజన్సీలు దర్యాప్తు చేశాయి.  తన హయాంలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతిగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు.

ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణం. అయినా.. రెండేళ్లుగా సాగుతున్న దర్యాప్తు కేసులో ఇప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా?.  స్కామ్‌లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు. రాజకీయ దురుద్దేశమే ఉంటే అరెస్ట్‌కు ఇన్ని రోజులు ఎందుకు సమయం పడుతుంది?. డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్లిందనేది తేలడానికి టైం పట్టింది. బెనిఫీషియరీ కూడా చంద్రబాబే అని తేలడంతో అరెస్ట్‌ చేశారు. ఆయన్నేదో కరుణానిధిని అరెస్ట్‌ చేసినట్లు అర్ధరాత్రి ఏమీ అరెస్ట్‌ చేయలేదు. పకడ్బందీగా ప్లాన్‌ చేసిన స్కామ్‌ కేసులోనే చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు అని సజ్జల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement