‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?! | Radikaa Sarathkumar Support Vijay Sethupathi In 800 Biopic Controversy | Sakshi
Sakshi News home page

‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!: రాధిక

Published Fri, Oct 16 2020 6:43 PM | Last Updated on Fri, Oct 16 2020 7:43 PM

Radikaa Sarathkumar Support Vijay Sethupathi In 800 Biopic Controversy - Sakshi

చెన్నై: హీరో విజయ్‌ సేతుపతి క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ ‘800’లో నటించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి రాధిక శరత్‌కుమార్‌ విజయ్‌ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించొద్దని విజయ్‌ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే. అంతేగాక పలు తమిళ సంఘాలు కూడా దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో రాధిక శుక్రవారం వరుస ట్వీట్‌లు చేస్తూ విజయ్‌ సేతుపతికి, చిత్ర పరిశ్రమకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలను, వినోదాన్ని కలపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు!)

రాధిక ట్వీట్‌ చేస్తూ.. ‘జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్‌ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్‌ను కోచ్‌గా నియమించిన ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు. అలాగే ‘‘సన్‌రైజర్స్‌, సన్‌ టెలివిజన్‌ ఛానెల్‌కు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. అయినప్పటికి రాజకీయాలను, క్రికెట్‌ను, వినోదాన్ని వృత్తిపరంగా తగిన మార్గంలో స్ఫష్టంగా నిర్వహిస్తోంది. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమను, వినోదాన్నేందుకు చూడకూడదు’’ అని ప్రశ్నించారు. అయితే తను ఈ విషయాన్ని వివాదం చేయాలనుకోవడం లేదన్నారు. కేవలం సినీ పరిశ్రమకు, నటులకు న్యాయపరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో తటస్థతకు, పక్షపాతరహితానికి సాక్ష్యం ఇచ్చేందుకే సన్‌రైజర్స్‌ పేరును వాడాను అంటూ రాధిక మరో ట్వీట్‌లో స్పష్టం చేశారు. (చదవండి: విజయ్‌ సేతుపతికి జంటగా నిత్యా‌ మీనన్‌)

అయితే ఎమ్మెస్‌ శ్రీపతి దర్శకత్వంలో 800 పేరుతో శ్రీలంక క్రికెటర్‌ మురళీధరన్‌‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మురళీధరన్‌‌గా విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలో ఫస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీలంక మతవాదానికి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య అని అలాంటి నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రంలో విజయ్‌ సేతుపతి నటించవద్దంటూ దర్శకుడు భారతీరాజు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అంతేగాక 800కు వ్యతిరేకంగా పలు తమిళ సంఘాలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు శీను రామస్వామి, చేరన్‌ కూడా ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: విజయ్‌ సేతుపతికి జంటగా నిత్యా‌ మీనన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement