టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్. శ్రీలంకకు చెందిన మురళీ తన టెస్టు కెరీర్‌లో 800 వికెట్లు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మురళీ కెరీర్‌ను చాలాకాలం వెంటాడి నిద్రలేకుండా చేసింది మాత్రం అతని బౌలింగ్ యాక్షన్. ఎంతలా అంటే మురళీ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని బౌలింగ్ మాత్రమే చర్చ నడిచేంతగా.