న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన యువరాజ్ సింగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల పేర్లను యువీ వెల్లడించాడు. తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరనేనని స్పష్టం చేశాడు. మురళీధరన్‌ను ఆడటానికి తీవ్ర ఇబ్బందులు పడేవాడినన్న యువీ.. అదే సమయంలో పేస్ విభాగంలో ఆసీస్ మాజీ పేసర్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వచ్చేదన్నాడు.
ఈ ఇద్దరే తనను ఎక్కువ ఇబ్బందులు గురి చేశారని యువీ పేర్కొన్నాడు. ఇక తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్నకు ఆసీస్‌కు రెండుసార్లు వరల్డ్‌కప్ సాధించి పెట్టిన రికీ పాంటింగ్ అని బదులిచ్చాడు. పాంటింగ్ బ్యాటింగ్‌తో పాటు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ల ఆటను ఎక్కువగా ఆస్వాదించానన్నాడు.
(ఇక్కడ చదవండి: అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment