ఒకే ఓవర్‌లో ఏడు సిక‍్సర్లు | Sri Lankan teenager Navindu Pahasara slams 7 sixes in 1 over | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్‌లో ఏడు సిక‍్సర్లు

Published Sat, Dec 16 2017 11:22 AM | Last Updated on Sat, Dec 16 2017 11:22 AM

Sri Lankan teenager Navindu Pahasara slams 7 sixes in 1 over - Sakshi

కొలంబో:రవిశాస్త్రి, యువరాజ్‌ సింగ్‌, హెర్ష్‌లీ గిబ్స్‌ వీరంతా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు.  అయితే తాజాగా భారత్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా ఆరు సిక్సర్లు సాధించి వారి సరసన నిలిచాడు. సౌరాష్ట్ర టీ20 టోర‍్నమెంట్‌లో జడేజా ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా, వీరిని తలదన్నేలా శ్రీలంకకు చెందిన టీనేజర్‌ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇలా ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టడం ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.

అండర్‌-15 మురళీ గుడ్‌నెస్‌ కప్‌ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడుతున్న నవీందు పహసర (89 బంతుల్లో 109) ఈ ఫీట్‌ సాధించాడు. ఒక బంతి నోబాల్‌ కావడంతో ఆ కుర్రాడు ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టడం సాధ్యమైంది. లంక మాజీ స్పిన్నర్‌ మురళీధరన్‌ తన ఫౌండేషన్‌ తరఫున ఈ టోర్నీ నిర్వహిస్తున్నాడు. నవీందు అద్భుత ఇన్నింగ్స్‌తో కొట్టావాపై  ఎఫ్‌ఓజీ విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement