
క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నారు హీరో రానా. ఆడటానికి కాదు. ఆడించడానికి. శ్రీలంక ప్రముఖ మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నారు. ఈ సినిమాను థార్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి రానా నిర్మించనున్నారు. ‘‘థార్ ఫిల్మ్స్‌తో సురేష్ ప్రొడక్షన్స్ అండ్ నేను కలిసి లెజెండరీ క్రికెటర్ మురళీధరన్ బయోపిక్‌ను నిర్మించబోతున్నాం’’ అని రానా పేర్కొన్నారు. ఈ సినిమాకు ఎమ్‌ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment