
నమ్మకద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న చిత్రంలో నటించొద్దని నటుడు విజయ్‌సేతుపతికి దర్శకుడు భారతీరాజా హితవు పలికారు. శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రను 800 పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముత్తయ్యమురళీధరన్ పాత్రలో విజయ్‌సేతుపతి నటిస్తున్నారు. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు.
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో విజయ్‌సేతుపతి నటిస్తుండడంపై తమిళ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. భారతీరాజా 800 చిత్రంలో నటించొద్దని విజయ్‌సేతుపతికి హితవు పలుకుతూ గురువారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో శ్రీలంక మతవాదనకి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్ అని అన్నారు. ముత్తయ్య మురళీధరన్ నమ్మకద్రోహి అని పేర్కొన్నారు. అదేవిధంగా దర్శకుడు శీను రామస్వామి, చేరన్ కూడా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment