రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌ | Rana Daggubati to Produce Muttiah Muralitharan Biopic     | Sakshi
Sakshi News home page

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

Published Tue, Jul 30 2019 1:24 PM | Last Updated on Tue, Jul 30 2019 2:34 PM

Rana Daggubati to Produce Muttiah Muralitharan Biopic     - Sakshi

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ బయోపిక్‌లో ముత్తయ్యగా తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నారు. థార్‌మోషన్‌ పిక్చర్స్‌తో సంయుక్తంగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర మేకర్స్‌ మంగళవారం ప్రకటించారు. విజయ్‌ సేతుపతి, దర్శకుడు రంగస్వామి, థార్‌ ప్రొడక్షన్‌తో కలిసి పనిచేయబోతుండడం ఉత్సాహంగా ఉందని రానా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఇక సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్ట్‌ క్రికెట్‌లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్‌ సొంతం. సో.. ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ మాత్రం డిసెంబర్‌లో ప్రారంభంకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement