వరల్డ్‌క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేటస్ట్ బ్యాటర్ అంటే చాలా మంది భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ఏ సర్ వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, ధోని వంటి వారి పేర్లను చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత తరంలో అయితే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, బాబర్ ఆజం, రోహిత్ శర్మలో ఎవరో ఒకరని అత్యుత్తమ బ్యాటర్‌గా ఎంచుకుంటారు.
కానీ శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ దృష్టిలో వీరవరూ గ్రేటెస్ట్ ఆటగాళ్లు కాదంట. వరల్డ్ క్రికెట్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న మురళీధరన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా మురళీధరన్‌కు మీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది.
అక్కడ ఉన్నవారంతా సచిన్ లేదా కోహ్లి పేరును చెబుతారని భావించారు. కానీ ముత్తయ్య మాత్రం అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరును ముత్తయ్య చెప్పాడు.
కాగా భారత క్రికెట్‌లో సెహ్వాగ్‌కు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 14 ఏళ్ల పాటు టీమిండియాకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. వీరేంద్రడు తన అంతర్జాతీయ కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 ఆడాలు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు.
చదవండి: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా?
Recalling those names etched in GOLD! 😍
— Star Sports (@StarSportsIndia) October 3, 2023
Our StarCast @IrfanPathan, @wasimakramlive, @M_Raj03, @PiyushChawla255 & more name their greatest of all time ODI cricketers!
Name yours 👇 pic.twitter.com/gP8UCAnNgu
Comments
Please login to add a commentAdd a comment