హోరాహోరీగా క్రికెట్ పోటీలు
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
Published Sun, Dec 4 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
గుంటూరు స్పోర్ట్స్: కాపు రిజ్వరేషన్ సాధికారిక వింగ్ చైర్మన్ పెమ్మా అంకమ్మరావు అధ్వర్యంలో అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వంగవీటి మోహన్ రంగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లను మాజీ శాసనసభ్యుడు లింగంశెట్టి ఈశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొరివి వినయ్ కుమార్, నిర్వాహకులు పెమ్మా అంకమ్మరావు, ఎస్.నరేష్, పెమ్మా శ్రీనివాసరావు, శృంగారపు శ్రీనివాసరావు, బి.వీరయ్య, తోట మధు, తల్వాకర్ జట్టు కెప్టెన్ ఎండి జావీద్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాచ్ ఫలితాలు..
ఉదయం జరిగిన మ్యాచ్‌లో తల్వాకర్ జట్టు 41 పరుగుల తేడాతో మనోజ్ జట్టుపై విజయం సాధించింది. బ్యాటింగ్ చేపట్టిన మనోజ్ జట్టు 17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసి పరాజయం పాలైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఫణి జట్టు 8 వికెట్ల తేడాతో మెడికల్ మేనేజర్స్ జట్టుపై విజయం సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫణి జట్టు 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి విజయం సాధించింది.
Advertisement