
జార్జియా ట్రిప్ ప్లాన్ చేశారు హీరో విజయ్. ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. దీంతో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకే విజయ్ జార్జీయా ప్రయాణం అయ్యారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. వీలైనంత తొందరగా ఈ సినిమా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్న్ దర్శక నిర్మాతలు ఉన్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారు.
చదవండి:
ఓటు వేసిన హీరో విజయ్.. బిల్డప్ అంటూ ట్రోల్స్
విజయ్‌తో రొమాన్స్ చేయనున్న బుట్ట బొమ్మ!
Comments
Please login to add a commentAdd a comment