జార్జియా : అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. వివరాలు.. ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్(41) తన కుటుంబసభ్యులతో కలిసి ఇండియానాలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో సహా బయలుదేరాడు. అయితే జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్ రోడ్ సమీపంలోని దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయింది. కాగా విమానం కూలిపోతున్న దృశ్యాలను ఒకరు తన ఫోన్‌లో బంధించారు. విమానం కూలడానికి ముందు ఆకాశంలోనే విమానానికి మంటలంటుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత విమానం కూలిపోవడం వీడియోలో కనిపించింది.
ఈ ప్రమాదంలో షాన్ చార్ల్స్ సహా భార్య జోడిరే మోంట్, పిల్లలు జేస్ లామోంట్(6), ఎలిస్ లామోంట్(4)లతో పాటు పైలట్ లారీ రే ప్రూట్ (67) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ' రెండు ఇంజిన్లు గల టర్బో విమానం విల్‌స్టన్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు' అంటూ పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment