లైవ్‌లో రిపోర్టర్‌తో వెకిలి చేష్టలు | Man Misbehave With Women Reporter On Live TV In Georgia | Sakshi
Sakshi News home page

మహిళా రిపోర్టర్‌తో అసభ్య ప్రవర్తన

Published Sun, Dec 15 2019 3:01 PM | Last Updated on Sun, Dec 15 2019 3:06 PM

Man Misbehave With Women Reporter On Live TV In Georgia - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని జార్జియాలో ఎన్‌బీసీ అనుబంధ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని సవన్నా వంతెనపై ఇటివల జరిగిన మారథాన్‌ను అలెక్సా అనే రిపోర్టర్‌ లైవ్ రిపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మారథాన్‌లో భాగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రిపోర్టర్ వెనుక భాగంపై చెయ్యితో కొట్టాడు. అతని చేష్టలకు ఆ రిపోర్టర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనూహ్య ఘటన నుంచి తేరుకుని కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏ మహిళా ఉద్యోగి ఇలాంటి చేదు అనుభవాన్ని చవిచూడాలనుకోదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ఆమె సవన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే అప్పటికే తన తప్పును గ్రహించిన థామస్ అనే ఆ ఆకతాయి ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేసి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నిజానికి తాను ఆమె భుజంపై తట్టాలనుకున్నానని.. కానీ ఆ సమయంలో అనుకోకుండా ఆమె వెనుక భాగంపై కొట్టానని చెప్పాడు. అయినప్పటికీ రిపోర్టర్ ఫిర్యాదు మేరకు సవన్నా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement