ఆగేది లేదు | Prabhas and Pooja Hegde head to Georgia for shoot despite Coronavirus scare | Sakshi
Sakshi News home page

ఆగేది లేదు

Published Sun, Mar 15 2020 12:45 AM | Last Updated on Sun, Mar 15 2020 12:45 AM

Prabhas and Pooja Hegde head to Georgia for shoot despite Coronavirus scare - Sakshi

ప్రభాస్‌

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కంగారులో ఉన్నారు. చాలా సినిమాల షూటింగ్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయి. కానీ ప్రభాస్‌ కొత్త చిత్రం షూటింగ్‌ మాత్రం జార్జియాలో ముందు ప్లాన్‌ చేసిన ప్రకారమే జరుగుతోందని దర్శకుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. ‘‘పది డిగ్రీల ఉష్ణోగ్రత, వర్షం, దానికి తోడు కరోనా కంగారు. వీటన్నింటి మధ్య కూడా మా సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తున్నాం. మా టీమ్‌ స్పిరిట్‌ని ఏదీ ఆపలేదు’’ అని రాధాకృష్ణ ట్వీట్‌ చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడిక్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని   తెరకెక్కిస్తున్నారు రాధా కృష్ణ. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement