ఇళ్ల మధ్యలో ఖననం.. అడ్డుకున్న స్థానికులు | Saint nissi church father died in hyderabad | Sakshi
Sakshi News home page

ఇళ్ల మధ్యలో ఖననం.. అడ్డుకున్న స్థానికులు

Published Sun, Apr 23 2017 10:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Saint nissi church father died in hyderabad

హైదరాబాద్‌సిటీ: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సెయింట్ నిస్సి చర్చ్ పాదర్ పురుషోత్తం చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఖననం చేయడానికి వాళ్ల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో చుట్టుపక్కల కాలనీ వారు అడ్డుకుని జనావాసాల మధ్య మృతదేహాన్ని ఖననం చేయడం ఏమిటని ఆందోళన చేశారు.

ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మల్కాజిగిరి పోలీసులు హుటాహుటిన అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలు పట్టుదలకు పోవడంతో మల్కాజిగిరి ఎమ్మార్వో  సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా వచ్చి ఇండ్ల మధ్యన ఖననం లాంటివి చేయకూడదని తెలిపారు. చివరికి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement