MLC Ramachandra Rao
-
రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేద్దాం
కోస్గి (కొడంగల్) : ప్రధాని మోదీకి భయపడే కేసీఆర్ ముందస్తూ ఎన్నికలకు వెళ్లారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడంతోపాటు పాలమూర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే శంఖారావం సభతో పార్టీ సత్తా చాటుదామని ఆయన పిలుపునిచ్చారు. కోస్గిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోలాయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్‌కు సాధ్యం కాలేదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహితంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని వెల్లడించారు. కాగా, శనివారం పాలమూరులోజరిగే శంఖారావ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్య అథితిగా వస్తున్నారని, ఈ సభకు ప్రతీ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక శివాజీ చౌరస్తాలో హిందూ వాహిని ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎమ్మెల్సీ పూజలు చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, మండల అధ్యక్షుడు నారాయణ, నాయకులు గందె వెంకటయ్య, వెంకట్‌నర్సిములు, శ్రీకాంత్, కూర వెంకటయ్య, మదన్ పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి మద్దూరు (కొడంగల్) : బీజేపీ ద్వారానే దేశంతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావ్ నామాజీ తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని గ్రామపంచాయతీలకు కేంద్రప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉచితంగా 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర పెంచామని గుర్తుచేశారు. కాగా, శనివారం పాలమూరులో జరిగే ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకటయ్య, శ్రీనివాస్, లాలప్ప పాల్గొన్నారు. -
బడ్జెట్ అంకెల గారడీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని.. భారీగా కేటాయింపులు చూపుతూ, తక్కువగా ఖర్చు చేస్తున్నారని శాసన మండలిలో బీజేపీ మండిపడింది. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తోందని విమర్శించింది. సోమవారం శాసనమండలి లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడారు. రెండున్నర లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తా మని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ నాలుగేళ్లలో నిర్మించినది 9 వేల ఇళ్లు మాత్రమేనన్నారు. ప్రస్తుత బడ్జెట్లోనూ డబుల్ ఇళ్లకు కేటాయించింది రూ.4 వేల కోట్లేనని.. ఈ నిధులతో ఎన్ని లక్షల ఇళ్లు కడతారని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే అంకెల గారడీ బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరు రైతులు ఖరీఫ్, రబీ రెండు పంటలు పండించడం సాధ్యం కాదని.. అలాంటప్పుడు రెండో పంటకు కూడా రూ.4 వేల చొప్పున ఏవిధంగా సహాయం అందిస్తారన్న దానిపై స్పష్టత లేదన్నారు. దీనికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతోందని, ఈ ఏడాది జూలై, ఆగస్టు కల్లా కాళేశ్వరం ప్రాజెక్టుతో మరిన్ని లక్షల ఎకరాల్లో రెండో పంట సాగవుతుందని చెప్పారు. రెండో పంట పండించే రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చి తీరుతామని చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యలను మండలిలో టీఆర్ఎస్ సభ్యులు తిప్పికొట్టారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దగా నిధులివ్వలేదని, తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా కేటాయించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతి వర్గాన్ని సంతృప్తి పరిచేలా ఉందని టీఆర్ఎస్ మరో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. మంత్రులు మండలికి రావాలి: స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సోమవారం సమావేశాలకు హాజరయ్యారు. మంత్రులు శాసన మండలికి దూరంగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం కేటాయించిన విధంగా మంత్రులు మండలికి హాజరుకావాలని.. సమయం ప్రకారం అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. -
ఇళ్ల మధ్యలో ఖననం.. అడ్డుకున్న స్థానికులు
హైదరాబాద్‌సిటీ: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సెయింట్ నిస్సి చర్చ్ పాదర్ పురుషోత్తం చనిపోయాడు. అతని మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఖననం చేయడానికి వాళ్ల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో చుట్టుపక్కల కాలనీ వారు అడ్డుకుని జనావాసాల మధ్య మృతదేహాన్ని ఖననం చేయడం ఏమిటని ఆందోళన చేశారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మల్కాజిగిరి పోలీసులు హుటాహుటిన అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలు పట్టుదలకు పోవడంతో మల్కాజిగిరి ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా వచ్చి ఇండ్ల మధ్యన ఖననం లాంటివి చేయకూడదని తెలిపారు. చివరికి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. -
ఎస్టీ బిల్లుకు మద్దతు,ముస్లిం బిల్లుకు వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లులో రెండు ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయని.. ఎస్టీల రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ బద్ధమైనది కాగా, ముస్లిం రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైనదని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తాజా బిల్లు అంశమూ కోర్టుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను పెంచడానికి మద్దతు తెలుపుతున్నామని, ముస్లిం రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు బిల్లుపై చర్చలో రామచంద్రరావు మాట్లాడుతూ.. ముస్లింల వెనుకబాటుదనంపై ప్రధాని మోదీ భువనేశ్వర్‌లో చేసిన వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ తెలివిగా తనను ఇరికించే ప్రయత్నం చేశారని నవ్వుతూ అన్నారు. శివలింగంపై తేలు ఉంటే దాన్ని ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే కుడుతుందని, అలాగని చెప్పుతో కొట్టలేమని.. ప్రస్తుతం తమ పరిస్థితి ఇలా ఉందంటూ చలోక్తి విసిరారు. రాష్ట్రంలో జనాభా నిష్పత్తిని బట్టి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాల్సిందేనని, అయితే ఈ బిల్లులో ముస్లింలు అనే ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కేసే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఇక పెంచిన 12 శాతానికీ అదే గతి పడుతుందన్నారు. -
అయితే అప్పుల భారతదేశమనాలా?: కేటీఆర్
హైదరాబాద్: బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మండలిలో మంత్రి కేటీర్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు మధ్య వాడివేడిగా చర్చ సాగింది. బంగారు తెలంగాణను బకాయిల తెలంగాణగా మార్చారని రాంచంద్రరావు ఆరోపించగా.. రాష్టం బకాయిల తెలంగాణ అయితే దేశాన్ని బకాయిల భారత దేశం అనాలా అని మంత్రి ఎదురుదాడికి దిగారు. అప్పుల విషయంలో రాష్ట్రాన్ని బకాయిల రాష్టం చేస్తున్నారని రాంచంద్రరావు అనగా.. రుణామాఫీల వల్ల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్న మోదీ, యూపీ ఎన్నికల సందర్బంగా రైతు రుణమాఫీని ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. రాష్ట్రానికో న్యాయం, యూపీకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చెల్లించాలని ప్రధానిని కలుద్దామంటే తామూ వస్తామని కేటీఆర్ అన్నారు. గత బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయలేదు, ఈసారి కేటాయింపులు భారీగా తగ్గించారన్న రాంచంద్రరావు వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కేటాయింపులు తగ్గాయని, సరిగ్గా ఖర్చు చేయలేదనే నిందారోపణలు సరికాదన్నారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కొత్త రాష్ట్రాలు ఇంకా కుదుట పడలేదు... తెలంగాణ మాత్రం రెండేళ్లలోనే నంబర్ వన్ స్థాయికి చేరిందంటే దాని వెనుక ప్రభుత్వ కృషిని గమనించాలని కోరారు. -
బీజేపీ నగర అధ్యక్షుడిగా రామచంద్రరావు
హైదరాబాద్ : బీజేపీ నగర శాఖ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాత్రి ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. -
కవిత గత విషయాలు మరచినట్లున్నారు
ఎమ్మెల్సీ రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: ఎంపీగా ఎన్నికయ్యాక కవిత గతం మరిచిపోయినట్లున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆమె తండ్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు డిమాండ్ చేసిన విషయాన్ని కవిత మరచిపోయినట్టున్నారని శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ ఉత్సవాలను అధికారికంగా జరపాలని బీజేపీ మాత్రమే డిమాండ్ చేయడం లేదని, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి, వీటి నిర్వహణకు సుముఖంగా లేదన్నారు. -
'ప్రైవేటుస్కూళ్ల దోపిడీ సీఎంకు కనిపించడంలేదా?'
హైదరాబాద్ : రాష్ట్రంలో చేయాల్సింది చేయకుండా కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ సీఎం కేసీఆర్‌కు కనిపించడంలేదా అంటూ రామచంద్రరావు ప్రశ్నించారు. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. అలాగే జలవివాదాలను ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.