
కవిత గత విషయాలు మరచినట్లున్నారు
ఎమ్మెల్సీ రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: ఎంపీగా ఎన్నికయ్యాక కవిత గతం మరిచిపోయినట్లున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆమె తండ్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు డిమాండ్ చేసిన విషయాన్ని కవిత మరచిపోయినట్టున్నారని శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ ఉత్సవాలను అధికారికంగా జరపాలని బీజేపీ మాత్రమే డిమాండ్ చేయడం లేదని, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి, వీటి నిర్వహణకు సుముఖంగా లేదన్నారు.