
బీజేపీ నగర అధ్యక్షుడిగా రామచంద్రరావు
హైదరాబాద్ : బీజేపీ నగర శాఖ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాత్రి ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు.