చర్చ్‌లో ఎంగేజ్‌మెంట్ | Amala Paul-Vijay's To Engagement In Church | Sakshi
Sakshi News home page

చర్చ్‌లో ఎంగేజ్‌మెంట్

Published Wed, May 14 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

చర్చ్‌లో ఎంగేజ్‌మెంట్

చర్చ్‌లో ఎంగేజ్‌మెంట్

నటి అమలాపాల్ వివాహ ప్రణాళిక సిద్ధమైంది. మైనా చిత్రంతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ అమలాపాల్ దైవ తిరుమగళ్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు విజయ్‌ను ప్రేమించారు.

నటి అమలాపాల్ వివాహ ప్రణాళిక సిద్ధమైంది. మైనా చిత్రంతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ భామ అమలాపాల్ దైవ తిరుమగళ్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు విజయ్‌ను ప్రేమించారు. వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఉపడంతో పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు విజయ్ హిందువు. అమలాపాల్ క్రిస్టియన్ కావడంతో విజయ్‌ను మతం మార్చుకోవాలని ఒత్తిడి పెరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను విజయ్ ఖండించారు. అదే విధంగా ఇరు సంప్రదాయాలను గౌరవించేలా విజయ్, అమలాపాల్‌ల వివాహం జరగనున్నట్లు తెలిసింది.
 
 జూన్ 7న కేరళలోని కొచ్చిన్‌లోని సెయింట్‌జుడ్ చర్చిలో విజయ్, అమలాపాల్ ఎంగేజ్‌మెంట్ జరగనుంది. కొద్దిమంది ఇరువురి స్నేహితులు, సన్నిహితులు పాల్గొనే ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మతధర్మం ప్రకారం విజయ్, అమలపాల్ ఉంగరాలు మార్చుకోనున్నారు. ఆ తరువాత నెడుంబాసరి లోని సీఐఏఎల్ కన్వెన్షన్ సెంటర్‌లో బ్రహ్మాండమైన విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విందులో పలువురు మలయాళ చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు.
 
 ఆ తరువాత జూన్ 12న చెన్నైలో హిందూ సంప్రదాయబద్దంగా విజయ్, అమలాపాల్ వివాహం జరగనున్నట్లు అమలపాల్ తల్లి ఇటీవల వెల్లడించారు. ఈ కార్యక్రమం స్థానిక అడయార్‌లోని రామనాథన్ శెట్టియార్ హాలులో జరగనుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం అమలాపాల్ మలయాళంలో మోహన్‌లాల్ సరసన లైలా ఓ లైలా చిత్రంలోను, దర్శకుడు రాజేష్ పిళ్లై దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. వివాహానంతరం తన నటనను కొనసాగిస్తానని అమలాపాల్ పేర్కొనడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement