
గోకులంలో వేడుకలు నిర్వహిస్తున్న భక్తులు
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాం చిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో చిన్నారులకు శ్రీకృష్ణుడి వేషధారణ చే యించి.. పిల్లనగ్రోవితో పాటలు పాడించారు. గోమాతకు పసుపు, కుంకుమలు చల్లి మహిళలు పూజలు చేశారు. శ్రావణ మాసం కావడంతో మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మి వత్రాలను ఆచరించారు. శ్రీకృష్ణాష్టమి జన్మదిన ప్రాధాన్యతను భక్తులకు అర్చకులు వివరించారు. చిన్నారులకు వేసిన శ్రీకృష్ణుడి వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏవీ.రమణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, అర్చకులు కురవి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి, అర్చకులు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.