ceremonies
-
అధికార లాంఛనాలతో హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు
పరిగి: ఉమ్మడి రాష్ట్ర ఉప సభాపతి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం పరిగిలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హరీశ్వర్‌రెడ్డి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం పట్టణంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రముఖులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం పల్లవి డిగ్రీ కళాశాలలోని మైదానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు. ప్రముఖుల నివాళి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు, టీడీపీ నేత కాసాని వీరేశ్ తదితరులు హరీశ్వర్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా హరీశ్వర్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గన్ మిస్ ఫైర్ అంత్యక్రియల సందర్భంగా గాలిలో కాల్పులు చేసే క్రమంలో ఒకరి చేతిలోని గన్ అకస్మాత్తుగా పేలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
గుండె బరువుతో పాటకు సెలవు..
సాక్షి, సిటీబ్యూరో/అల్వాల్/ గన్‌పౌండ్రి: ప్రజా యుద్ధనౌక ఇక సెలవంటూ తరలివెళ్లింది. తన పదనునైన గళంతో, ఉర్రూతలూగించే పాటలతో అర్ధ శతాబ్దం పాటు యావత్ సమాజాన్ని ప్రభావితం చేసిన సాంస్కృతిక యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం అల్వాల్ భూదేవినగర్‌లో ఆయన స్థాపించిన మహాబోధి పాఠశాలలో ముగిశాయి. వేలాదిమంది అభిమానులు, వివిధ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలమైన భూమికను పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేసిన గద్దర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. బౌద్ధమత సాంప్రదాయం ప్రకారం గద్దర్ తనయుడు సూర్య అంత్యక్రియల క్రతువును నిర్వహించారు. బౌద్ధమత గురువులు పంచశీల సూత్రాలను పఠించారు. అనంతరం గద్దర్ పార్థివదేహాన్ని సమాధి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. గద్దర్ భార్య విమలను, కుటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, తలసాని తదితరులు సీఎం వెంట ఉన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా అల్వాల్‌లో గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దానం నాగేందర్, టి.రాజయ్య, జీవన్‌రెడ్డి, మంచు మోహన్‌బాబు, మనోజ్, అలీ, నాగబాబు, నిహారిక, పరుచూరి గోపాలకృష్ట, ఆర్.నారాయణమూర్తి, ప్రొఫెసర్ కోదండరాం, జయప్రకాశ్ నారాయణ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, అనగాని సత్యప్రసాద్, జనార్ధన్, పరిటాల శ్రీరామ్, వివేక్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. భూదేవినగర్, వెంకటాపురం ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. అంత్యక్రియలకు ప్రముఖులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మల్లు రవి ,శ్రీధర్‌బాబు, మాభూమి చిత్ర దర్శకులు నర్సింగ్ రావు, ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య, జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్, విమలక్క, బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న, బాల్క సుమన్, క్రాంతి, గెల్లు శ్రీనివాస్, పల్లె రవి, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జర్నలిస్టు పాశం యాదగిరి, వేదకుమార్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దారంతా జన ప్రభంజనం తెలుగు ప్రజల సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ అంతిమయాత్ర మహాజన ప్రభంజనాన్ని తలపించింది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు రహదారులు జసందోహంతో పోటెత్తాయి. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన గద్దర్ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ (అంబేడ్కర్ విగ్రహం), సికింద్రాబాద్ మీదుగా సాయంత్రం 4 గంటలకు అల్వాల్‌కు చేరుకుంది. వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్దుడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కళాకారులు పాటలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ పార్థివదేహాన్ని ఉంచిన వాహనానికి ముందు, వెనుక వేలాదిగా కదిలివచ్చిన అభిమానులు ‘అమర్ రహే గద్దర్’, ‘జోహార్ గద్దరన్న’ అంటూ ఇచ్చిన నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఎల్బీ స్టేడియంలో ఘన నివాళులు ఎల్బీ స్టేడియంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రి జానారెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రత్యేక వేదికలు.. కటౌట్లు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ఎక్కడికక్కడ వాహనాన్ని నిలిపివేసి ఆయన భౌతికకాయానికి నమస్కరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. దారి పొడవునా అక్కడక్కడా పెద్ద ఎత్తున గద్దర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రజా నాట్యమండలి, జన నాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన కళాకారుల ఆట, పాటల నడుమ గద్దర్ అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో విషాదం సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ కన్నుమూత గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో అల్వాల్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చిక్కుకున్న సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (63) తీవ్రమైన నీరసంతో జనంమధ్యలో పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు చెప్పారు. గద్దర్‌కు సన్నిహితుడైన జహీరుద్దీన్ ఆదివారం నుంచి ఆయన భౌతికకాయం వద్దే ఉన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్ర, ఆయన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన ఉర్దూ పత్రికారంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు. జహీరుద్దీన్ కుటుంబసభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జహీరుద్దీన్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించి చెరగని ముద్ర వేశారని, దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. వ్యక్తిగతంగా జహీరుద్దీన్ అలీఖాన్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గుర్తు చేసుకున్నారు. అతని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కలి్పంచాలని భగవంతుడిని కోరారు. జహీరుద్దీన్ మృతిపై ఇంకా ఏఐఎంఎస్ఎస్ రాష్ట్ర ఇన్చార్జి సీహెచ్.ప్రమీల, ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌రాజ్, ఏఐడీవైఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వై.నాగరాజు సంతాపం తెలిపారు. కలం.. గళం 24 గంటల్లోనే లోకాన్ని విడిచిన ఆప్తమిత్రులు ప్రజాయుద్ధనౌక గద్దర్, ‘సియాసత్’జహీరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: అవును వారిద్దరూ ఆప్తమిత్రులు... ఎన్నో ఆలోచనలు..మరెన్నో చర్చలు..ఇద్దరూ సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన వారే.. 24 గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లారు. వారిలో ఒకరు తన ఆటాపాటతో విప్లవ, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదితే.. మరొకరు పత్రిక ద్వారా మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పక్షాన నిలిచారు. వారే ప్రజాయుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు.. మరొకరు సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్. వారిద్దరూ సియాసత్ కార్యాలయంలో గంటల తరబడి చర్చల్లో మునిగితేలేవారు. గద్దర్ వారానికోసారైనా సియాసత్ కార్యాలయానికి వెళ్లడం అక్కడ సామాజిక, రాజకీయ అంశాలే కాకుండా ప్రజానీకం సమస్యలపై తరచు చర్చలు సాగించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వీరిద్దరూ కీలకభూమిక పోషించారు. సియాసత్ తరఫున నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు సంబంధించి జహీరుద్దీన్అలీఖాన్ గద్దర్‌తో చర్చించేవారు. గద్దర్ మరణించిన వార్త తెలిసి జహీరుద్దీన్ చలించిపోయారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్‌లోని వెంకటాపూర్ వరకు పార్థివదేహం వెళ్లిన వాహనంలోనే ఆయన వెళ్లారు. అక్కడ దిగిన తర్వాత గద్దర్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారిగా జనం తోపులాట ఎక్కువ కావడం, ఆ మధ్యలోనే జహీరుద్దీన్ పడిపోవడం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. దగ్గర్లోని ఆస్పత్రికి ఆయన్ను తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అందరివాడు గద్దర్ అన్ని రంగాలు, వర్గాలతో సన్నిహితంగా మెలిగిన ప్రజాగాయకుడు సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం..పీడిత వర్గాల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించిన గొంతు అది..పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులను సైతం లెక్క చేయక నిలబడి కొట్లాడిన గళం అది..అయినాసరే గద్దర్ అజాత శత్రువుగానే బతికారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు తన విధానాన్ని సుస్పష్టం చేశారు. తన వ్యవహార శైలితో సమాజంలోని అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. రాజకీయ పారీ్టలకతీతంగా ప్రముఖ నాయకులందరితోనూ సాన్నిహిత్యాన్ని సంపాదించారు. కళాకారుడిగా, రచయితగా సినీరంగంతోనూ ఆయన అనుబంధం కొనసాగింది. గద్దర్ మరణ వార్తతో అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సోమవారం జరిగిన గద్దర్ అంతిమయాత్ర ఆసాంతం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. 1972 నుంచి 2012 వరకు నాలుగు దశాబ్దాల విప్లవ ప్రస్థానంలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్ తన పాటలతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదారు. ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాట గొంతుకగా నిలిచారు. నిక్కచ్చిగా మాట్లేడే తత్వమే గద్దర్‌కు ఎంతో మందిని దగ్గర చేసింది. మావోయిస్టు ఉద్యమాలకు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన అందించిన తోడ్పాటును గుర్తుచేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించిన ప్రజాయుద్ధ నౌక అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వమే అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఉద్యమ సమయంలో, అనేక ఎన్కౌంటర్ల సమయంలో పోలీసులతో ఎన్నో అంశాలపై కొట్లాడిన గద్దర్‌కు నివాళులర్పించేందుకు ఒకప్పటి ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్ సైతం వచ్చారు. గద్దర్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు, తోటి రచయితలు, అంతిమయాత్రలో పాదం కలిపారు. మావోయిస్టు ఉద్యమంతో దశాబ్దాలు గడిపిన గద్దర్‌కు చివరి గడియల్లో పోలీసు తుపాకులు గౌరవ వందనం సమర్పించడం.. ఆయన అందరివాడన్న దానికి మరో నిదర్శనంగా నిలిచింది. -
కేసీఆర్ దత్తత గ్రామాల్లో పండుగ వాతావరణం
-
వెంకన్న గుడిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాం చిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులంలో చిన్నారులకు శ్రీకృష్ణుడి వేషధారణ చే యించి.. పిల్లనగ్రోవితో పాటలు పాడించారు. గోమాతకు పసుపు, కుంకుమలు చల్లి మహిళలు పూజలు చేశారు. శ్రావణ మాసం కావడంతో మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మి వత్రాలను ఆచరించారు. శ్రీకృష్ణాష్టమి జన్మదిన ప్రాధాన్యతను భక్తులకు అర్చకులు వివరించారు. చిన్నారులకు వేసిన శ్రీకృష్ణుడి వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏవీ.రమణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, అర్చకులు కురవి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి, అర్చకులు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
అందం... చందం... ఆషాఢం
మాసం ఆషాఢం అనగానే శూన్యమాసమనీ, శుభకార్యాలకు పనికిరాదనీ పెదవి విరుస్తుంటారు చాలామంది. ఆషాఢమనేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల పాలిట విలన్ లాంటిదని పళ్లు కొరుక్కుంటారు ఇంకొంతమంది. నిజానికి ఆషాఢమాసం తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించే మాసం. విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు శాకంబరిదేవిగా అలంకరించి మురిసిపోతారు. జగానికే నాథుడైన పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేది ఈ నెలలోనే. అని తల్లీతండ్రీ తర్వాత స్థానంలో ఉన్న గురువులను పూజించి, గౌరవించే గురుపౌర్ణమి వేడుకలు జరిగేది ఆషాఢంలోనే కదా! ఆడపడచులందరూ గోరింటాకుతో ఎర్రగా మిరప్పళ్లలా పండిన చేతులతో కనిపించేది, ఈ కాలంలో విరివిగా వచ్చే వాక్కాయలతో పప్పు, మునగకాడలతో ఘుమఘుమలాడే చారో పులుసో కాచుకునేది, పొట్లకాయ కూర, పెరుగుపచ్చడి చేసుకునేది ఆషాఢంలోనే! కొత్తగా పెళ్లయ్యి, పుట్టింటి మీద బెంగను అత్తమామలకి చెప్పుకోలేక తనలో తనే సతమతమవుతూన్న కొత్తకోడలి పాలిట ఆపద్భాంధవి ఆషాఢం కాదా! అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులను అర్థం చేసుకుంటూ, వాళ్లకి కావలసినవి వేళకు ఎలా అమర్చగలమా అని ఆందోళన పడే వేళ నేనున్నానంటూ వచ్చి, కళ్లు తుడిచేది ఆషాఢమే కదా! మొన్న మొన్ననే పెళ్లయ్యింది.. భార్యతో ఇంకా అచ్చటాముచ్చటా తీరనేలేదు... ఇంతలోనే నా పాలిటి విలన్లా దాపురించింది ఆషాఢం అని తిట్టుకునే రోజులా ఇవి! ఎప్పుడో పోయాయి. ఆషాఢంలో అత్తాకోడలూ, అత్తా అల్లుడూ నే కదా, ఒక గడప దాటకూడనిది, మొగుడూ పెళ్లాల విషయంలో ఆ రూలేమీ లేదు కదా అని ఎట్లాగో అట్లా నానా తంటాలు పడుతూ వెళ్లి, భార్యను ఆమె బాబాయి ఇంటికో, పిన్నిగారింటికో రప్పించుకుంటే సరి, అక్కడ కూడా మర్యాదలన్నీ అందుకోవచ్చుకదా! అని ఆలోచించని వాళ్లు, దానిని వెంటనే అమలు చెయ్యని వాళ్లు చాలా అరుదు. అసలు ఆషాఢంలో కలుసుకోకూడనిదే భార్యాభర్తలు. ఎందుకంటే ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల గర్భోత్పత్తి జరిగి, ఎండాకాలంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అప్పుడే భూమిమీదికొచ్చిన చిన్నారులు ఆ ఎండలను తట్టుకోలేక నానా ఇబ్బందులూ పడతారు. వాళ్ల బాధలు చూడలేక మళ్లీ మనం బాధపడాలి. అదొక్కటేనా? వ్యవసాయ పనులు ఆరంభమయ్యేది తొలకరి జల్లులు కురిసే ఆషాఢంలోనే. అంతకాలం ఎండవేడిమికి భూమిలోపలి పొరల్లో దాగి ఉన్న క్రిమికీటకాలు వర్షాలకు బయటికొచ్చి, వీరవిహారం చేస్తాయి. ఈగలూ దోమలూ ముసిరి, రకరకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు. కొత్తగా పెళ్లయినవాళ్లేమో, భార్య ఇంటిదగ్గర ఉండి, ఆమె మీదకు ధ్యాస మళ్లుతూ ఉంటుంది. దానిమూలంగా వ్యవసాయ పనులు దెబ్బతింటాయి. రైతులకు ఇంత అన్నం పెట్టేది, ఆధారభూతమయ్యేదీ వ్యవసాయపనులే కదా, అందువల్లే పెద్దవాళ్లు నవ వధూవరుల మధ్యలో ఆషాఢాన్ని అడ్డం పెట్టారు. ఇన్ని విషయాలున్నాయన్నమాట ఆషాఢంలో అత్తాకోడలూ ఒక ఇంటి గడప దాటకూడదనడం వెనక! ఇక ఆషాఢం వచ్చింది మొదలు- గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల సణుగుడు తట్టుకోలేక కన్నెపిల్లలు ఎవరి దొడ్లోనో ఉన్న గోరింట చెట్టునుంచి ఇంత ఆకు దూసుకొచ్చి, అందులో ఇంత చింతపండు ముద్ద వేసి, మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరడం మొదలెడతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాఢంలో చేతులనిండా గోరింటాకు పెట్టుకుని, తిరిగి అత్తారింటికి వెళ్లాక అమ్మ లేదా చెల్లి పెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోతారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనక శాస్త్రీయ కారణాలేమిటంటే, గోరింట వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు మందారంలా పండితే మంచిమొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. ఇవన్నీ ఒకప్పటి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడయితే ఆషాఢం వచ్చిందంటే బంపర్ సేల్సు, డిస్కౌంట్ సేల్సు, ఆఫర్ల మీద ఆఫర్లు, కేజీల్లెక్కన చీరలమ్ముతారు... క్రెడిట్ కార్డుకు చిల్లులు పొడుస్తారు. సెల్ఫోన్లు కూడా ఒకటి కొంటే మూడు ఉచితం అని ఊరించడం, కొన్న తర్వాత ఫ్రీ పీసులకు మా పూచీ లేదని ముందే చెప్పాం కదండీ అని గిల్లుతూనే కావాలంటే, మరో పీసొచ్చింది చూడండి, ఎక్స్ఛేంజ్ చేసుకుని చూడండి అని ఊరడింపులు... ఇవి చూస్తుంటే ఆషాఢమంటేనే ఒకలాంటి బెంగ. డిస్కౌంట్ అంటేనే దిగులు..! - బాచి -
3 ముళ్లు 7 అడుగులు 10 రోజులు..
మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకునే జంటలకు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మరో పదిరోజులు మాత్రమే మిగిలాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఈ నెల 21, 22, 24, 29 తేదీల్లో వేల జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నాయి. 29వ తేదీ అనంతరం 116 రోజులు వివాహాలు, శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. * నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు * ఏప్రిల్ 30 నుంచి ఆగస్టు 30 వరకు బ్రేక్ * జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి ద్వారకాతిరుమల/జంగారెడ్డిగూడెం రూరల్ : ఈ నెలాఖరు వరకే వివాహ ముహూర్తాలు ఉండడంతో జిల్లా అంతటా పెళ్లిళ్ల సందడి నెలకొంది. 30వ తేదీ నుంచి మూఢం రావడంతో పాటు దాదాపు 116 రోజుల వరకు వివాహ, శుభకార్యాలలకు విరామం కల గనుంది. దీంతో ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు అందుకున్న జంటల తల్లిదండ్రులు ఈ పదిరోజుల్లో ఉన్న ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఈనెల 21, 24, 29 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో వే లాది జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్టు పురోహితులు తెలిపారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఆగస్టు 6 వరకు వేచి ఉండాల్సిందేనని అంటున్నా రు. పుష్కరాలు జరిగే కృష్ణానది పరివాహక ప్రాంతాల వారికైతే ఈ గడువు ఆగస్టు 23 వరకు ఉందని చెబుతున్నారు. శ్రీవారి క్షేత్రంలో సందడి ఈనెలాఖరు వరకు జరుగనున్న వివాహాలకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల (చిన్నతిరుపతి) శ్రీవారి క్షేత్రం వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి బృందాలు క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు, కాటేజీలు, గదులను ముందస్తుగా బుక్ చేసుకున్నారు. దీంతో వెనుక వచ్చే వారికి కష్టాలు తప్పనట్టే. శేషాచలకొండపైన, దిగువన ఈనెల 21, 22, 24, 29 తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి కల్యాణ మండపాలకు విద్యుద్దీపాలంకారాలు, అలాగే పచ్చిపూల మండపాలు వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నెలలో ముహూర్తాలు కొన్నే ఉండటంతో పెళ్లి సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. పురోహితులకు, ట్రావెల్స్‌కు డిమాండ్ ఏర్పడింది. వివాహాన్ని అట్టహాసంగా జరుపుకోదలచిన వారు ఖర్చును సైతం లెక్కచేయడం లేదు. ఇప్పటికే చిన్నతిరుపతి క్షేత్రంలో వివాహ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 6 వరకు వివాహాలకు బ్రేక్ ప్రస్తుతం చైత్రమాసం కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి శ్రావణంలో సగభాగం ముగిసే వరకు ముహూర్తాలు లేవు. ఈనెల 30 నుంచి జూలై 13 వరకు శుక్రమౌఢ్యం ఉందని పురోహితులు చెబుతున్నారు. ఆ వెంటనే ఆషాఢమాసం వస్తుందని, దాన్ని శూన్యమాసంగా భావించి వివాహాలు జరపరని పండితులు తెలిపారు. ఆ తర్వాత వచ్చే శ్రావణం శుభప్రదం కావడంతో ఆగస్టు 6 నుంచి వివాహ ముహూర్తాలు ఉన్నాయన్నారు. పురోహితులు.. వివాహ సామగ్రికి డిమాండ్ జిల్లాలో వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో వివాహ సామగ్రికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ కాగా పురోహితులు, షామియానా, లైటింగ్, పూలకు, పూల వేదికలు సెట్టింగ్‌లకు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ నెలకొంది. నెలల వారీగా ముహూర్తాలు ఇలా ఏప్రిల్ : 20, 21, 22, 24 27, 29 తేదీల్లో ముహూర్తాలు మే : శుక్లమౌడ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూన్ : గురుమౌఢ్యమి కావడంతో ముహుర్తాలు లేవు జూలై : ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు ఆగస్టు : శ్రావణమాసంలో 6 నుంచి 27వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి సెప్టెంబర్ : భాద్రపదం కావడంతో ముహర్తాలు ఉండవు అక్టోబర్ : ఆశ్వీయుజంలో 5 నుంచి 21 వరకు ముహూర్తాలు ఉన్నాయి నవంబర్ : కార్తీకంలో 2 నుంచి 24వ తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్ : మార్గశిరంలో 3 నుంచి 22 వరకు ముహూర్తాలు ఉన్నాయి. -
'ముహూర్తం' దాటింది..
మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఓ వైపు పుష్కరాలు.. మరోవైపు శూన్య మాసాలు, 'అధిక'ఆషాఢాలు.. ఇక అన్నీ మూఢాలే. మంచి తరుణం కోసం మరో నాలుగు నెలలు ఆగక తప్పదు. బుధవారం నుంచి ఎటువంటి శుభకార్యాల జోలికి వెళ్లవద్దని వేదపండితులు సూచిస్తున్నారు. ఇక శుభకార్యాలు బంద్ బాజాభజంత్రీలకు బ్రేక్ రేపటి నుంచి మూఢాలు ఖమ్మం : శుభ ముహూర్తాలు ముగిశాయి. మరో నాలుగు నెలల దాకా వివాహ, శుభకార్యాలు లేనట్టే. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నూతన పనుల ప్రారంభోత్సవాలకు తెరపడినట్టే. సుమారు 21రోజుల పాటు (మే 22 నుంచి జూన్ 11వ తేదీ వరకు) మేళ తాళాలు.. బాజాభజంత్రీలు.. విద్యుత్ దీపాల అలంకరణలు.. బంధు మిత్రులు.. బంగారు ఆభరణాలు.. వస్త్రాల కొనుగోళ్లతో సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చప్పబడింది. 17వ తేదీ నుంచి నాలుగు నెలల పాటు ఇక శుభ కార్యాల జోలే ఉండదు. ముగిసిన ముహూర్తాలు ఈ నెల 17 నుంచి శుభముహూర్తాలు ఉండవు. మంగళవారం అమావాస్య, బుధవారం నుంచి నిజ ఆషాఢం ప్రవేశిస్తుంది. ఇది జులై 16వ తేదీ వరకు ఉంటుంది. మళ్లీ జులై 17 నుంచి అధిక ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత భాద్రపదమాసం, శూన్యమాసం, శుక్రమూఢమిలు వరుసగా వచ్చాయి. ఈ నెలల్లో శుభకార్యాలు తలపెట్టరు. దీనికితోడు గోదావరి పుష్కరాలు కూడా రావటంతో పుష్కరకాలంలో శుభకార్యాలు చేయకూడదు. పుష్కరాల సమయంలో పెద్దలకు తర్పణాలు వదలటం.. వాళ్ల పేరిట శివలింగాల ప్రతిష్ఠ వంటివి చేస్తారు కాబట్టి ఈ నాలుగు నెలలు శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు శూన్యమాసాలే ఉంటాయి. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ముహూర్తాలు ఉండవు. ఇక ఈ నాలుగు నెలలు పెళ్లి మండపాలు మూగనోము పాటించాల్సిందే. కొత్తగా పెళ్లైన నవ వధువులు నెలరోజులు ఆషాఢమాసంలో పుట్టింటి వద్దనే ఉండటం సంప్రదాయం. మళ్లీ ఆశ్వయుజ మాసంలోనే... ఆశ్వయుజమాసం అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రవేశిస్తుంది. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు పుష్యమాసం రావటంతో ముహూర్తాలు ఉండవు. ఆ తరువాత ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మాగమాసం ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి శుభముహూర్తాలు పుష్కలంగా ఉంటాయని వేదపండితులు తెలిపారు. పుష్కరాలు ముగిసేవరకు వరుసగా మూఢాలు, శూన్యమాసాలు, అధిక ఆషాఢ మాసాలు రావటం వలన నాలుగు నెల ల పాటు ముహూర్తాలు లేవు. జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయూల్లో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. - రామడుగు గురుప్రసాదాచార్యులు, వేదపండితులు -
నాలుగు నెలలు.. ముహూర్తాల్లేవ్..!
* అప్పటి వరకూ పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నీ బంద్ * గోదావరి తీర ప్రాంతాల్లో 2016 ఆగస్ట్ వరకూ కరువే * జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేవంటున్న పండితులు సాక్షి, హైదరాబాద్: మీ అమ్మాయికో.. అబ్బాయికో త్వరలో పెళ్లి చేయాలని భావిస్తున్నారా.. అయితే మరో నాలుగు మాసాలు ఆగాల్సిందే. పెళ్లి అనేకాదు.. ఏ శుభకార్యం చేయాలన్నా వేచిచూడక తప్పని పరిస్థితి. జూన్ 11 దాటితే మంచి ముహూర్తాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు రెండు ఆషాఢాలు(అధిక, నిజ ఆషాఢం).. మరోవైపు గోదావరి పుష్కరాలు.. తరుముకొస్తుండటంతో శుభకార్యాల కోసం కనీసం నాలుగు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఏటా ఒకటే ఆషాఢ మాసం ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఉండవు. అయితే ఈసారి రెండు ఆషాడాలు(అధిక, నిజ ఆషాఢం) వస్తున్నాయి. దీంతో రెండు నెలలు ముహూర్తాలు ఉండవు. ఇక జూలై 14న గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే రోజూ గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అంతా పెద్దల్ని స్మరించుకుంటూ తర్పణం సమర్పిస్తారు. ఇలా పుష్కరాలు ప్రారంభమైన నాలుగైదు మాసాల వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలోనూ పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఇక గోదావరి నదీ తీరప్రాంతంలోని వారైతే 2016 ఆగస్ట్ వరకూ ఎలాంటి శుభకార్యాలు చేయకూడదట. మిగిలిన వారు మాత్రం దసరా తర్వాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని దోషాలున్నా పర్లేదు ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు దాటిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి ముహూర్తాలూ ఉండవు. అయితే ఉత్తమ పక్షం లేకపోయినప్పటికీ.. కొన్ని దోషాలు ఉన్నా.. తప్పని పరిస్థితుల్లో ముహూర్తాలు అంగీకారమే అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, ప్రముఖ జోతిష్య పండితుడు డాక్టర్ సీవీబీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. గోదావరి తీరప్రాంత వాసులకే.. జూన్ 11 తర్వాత ఆగస్టు 2016 వరకూ మంచి రోజులు లేవని కొంతమంది పండితులు చెపుతుంటే.. అలాంటిదేమీ లేదు నవంబర్ నుంచి ముహూర్తాలు పెట్టుకోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఇది గోదావరి తీరప్రాంత వాసులకే వర్తిస్తుందని, మిగతా వారు దసరా తర్వాత శుభకార్యాలు చేసుకోవచ్చని ప్రముఖ జోతిష్య పండితుడు సింహంభట్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు. 11 రోజులూ.. వేలాదిగా పెళ్లిళ్లు.. మరోవైపు జూన్ 11 తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో ఈ 11 రోజుల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసేందుకు వేలాదిమంది సిద్ధమయ్యారు. వరుసగా పెళ్లిళ్లు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు, పురోహితులకు మాంచి డిమాండ్ ఏర్పడింది. నగరంలో మూడు వేలకుపైగా ఫంక్షన్‌హాళ్లు ఉండగా అన్నీ ఇప్పటికే బుక్కయ్యాయి. ఫంక్షన్‌హాళ్లు బుక్కైపోవడంతో బస్తీల్లో ఖాళీ స్థలం కన్పిస్తే చాలు మండపం వేసేస్తున్నారు. ఇక పురోహితులకు సామాన్య, మధ్యతరగతి వారు వివాహానికి రూ.1,116 నుంచి రూ.10,116 వరకూ, ధనికులైతే బంగారాన్ని, ఎన్ఆర్ఐలైతే డాలర్లను సంభావనగా సమర్పించుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాండ్ బాజాలు, వంటవాళ్లు, డెకరేటర్లు, ఈవెంట్‌మేనేజర్లు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. -
సుగమం
మైసూరు దసరా కథ సుఖాంతం సంబరాల నిర్వహణపై తొలగిన అనిశ్చితి రాజ ప్రాసాదం వెలుపల సంబరాలకు రాణి ప్రమోదా ఓకే మైసూరు : రాణి ప్రమోదా దేవి రాష్ట్ర ప్రభుత్వంపై అలక వహించారనే వార్తలతో విశ్వ విఖ్యాత దసరా సంబరాల నిర్వహణపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోయింది. దసరా నిర్వహణకు తాను వ్యతిరేకం కాదని రాణి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్‌తో కలసి ఆమె గురువారం ఇక్కడ అంబా విలాస్ ప్యాలెస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ ప్రాసాదం వెలుపల దసరా నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాణి తెలిపారు. దసరా సన్నాహాలపై ఆమెలో అసంతృప్తి చోటు చేసుకుంది. దీనిని పోగొట్టడానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున మంత్రి ఆమెతో భేటీ అయ్యారు. దసరా వేడుకలకు హాజరు కావాలన్న ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆమె మన్నించారని అనంతరం మంత్రి తెలిపారు. జంబూ సవారీకి అంబారీని ఇచ్చేది లేదని రాణి చెప్పలేదని వెల్లడించారు. గత డిసెంబరులో శ్రీకంఠదత్త నరసింహ రాజ ఒడయార్ కన్నుమూసినందున, రాజ ప్రాసాదంలో వేడుకలు వద్దని మాత్రమే తాను చెప్పానని రాణి వివరించారు. రాజ ప్రాసాదంలో వెలుపల దసరా సంబరాల నిర్వహణకు తనకు ఎటువంటి ఆక్షేపణ లేదని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయలేదని స్పష్టం చేశారు. రాజ ప్రాసాదం విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా దసరా సంబరాలను నిర్వహిస్తామని ఇదే సందర్భంలో మంత్రి తెలిపారు. -
ఆ నాలుగు రోజులూ పెళ్లి సందడే
అమలాపురం :వచ్చేది శూన్యమాసం.. నాలుగు నెలల పాటు శుభకార్యాలు నిర్వహించే అవకాశం లేదు. అందుబాటులో రెండు బ్రహ్మాండమైన ముహూర్తాలు. ఇం కేం.. ముందుగా కుదుర్చుకున్నవారే కాకుండా ఇప్పటికిప్పుడు సంబంధాలు కుదుర్చుకున్నవారూ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో వచ్చే వారంలో జిల్లాలో పెళ్లి భాజాలు ఘనంగా మోగనున్నాయి. ఈనెల 13, 14,15,19 తేదీల్లో శుభముహూర్తాలు రావడంతో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశాలు, కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాల ఆరంభం వంటి కార్యక్రమాలు జోరుగా సాగనున్నాయి. 13వ తేదీన రాత్రి 7.54 గంటలకు, 12.33 గంటలకు, 14న రాత్రి 7.54, అర్ధరాత్రి 12.36, తిరిగి తెల్లవారు జామున 3.21కి, 15న రాత్రి 12.29కి, 19న తెల్లవారు జామున నాలుగు గంటలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 14న తెల్లవారుజామున 3.21, 15న అర్ధరాత్రి 12.29 గంటల ముహూర్తాలు మిథునలగ్నంలో రావడంతో ఈ రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి శూన్య మాసం మొదలవుతోంది. దీంతో డిసెంబర్ వరకూ ముహూర్తాలు లేవు. డిసెంబరులో ముహూర్తాలున్నా అవి చెప్పుకునేంత పెద్దవి కావు. బలమైన ముహూర్తాలు కావాలంటే ఫిబ్రవరి, మార్చి వరకూ వేచి చూడాల్సిందే. ఈ కారణాల వల్లే ఈ నాలుగు రోజుల్లో పెళ్లిళ్లు గృహప్రవేశాలు పూర్తి చేస్తున్నారు. 14న ఒక్కరోజే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వెయ్యి వరకు వివాహాలు జరగనున్నాయి. మిగిలిన ముహూర్తాల సమయంలో కూడా భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అమలాపురం శ్రీభూసమేత వెంకటేశ్వరరావు ఆలయంలో 150 వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. సమయం దగ్గర పడే నాటికి వీటి సంఖ్య ఇంకా పెరుగుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అన్నీ గిరాకీనే అటు పెళ్లిళ్లు.. ఇటు గృహప్రవేశాలు.. వేలాది సంఖ్యలో జరుగుతుండడంతో పురోహితుల వద్ద నుంచి వంట మేస్త్రుల వరకు, లైటింగ్ నుంచి పూల డెకరేషన్ వరకు గిరాకీ ఏర్పడింది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి పట్టణాలతోపాటు మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణమంటపాలు బుక్కయ్యాయి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నవారు ప్రైవేట్ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలపై ఆధారపడుతున్నారు. మిగిలినవారికి ఖాళీస్థలాలు.. ఇంటి ముందు రోడ్లే వివాహ వేదికలు కానున్నాయి. అయితే వర్షాకాలం కావడం వల్ల ఎక్కువ మంది కల్యాణ మంటపాలకే మొగ్గు చూపుతున్నారు. పురోహితులకు, వంటవారికి చేతి నిండా పనే అన్నట్టుగా ఉంది. లైటింగ్, బ్యాం డ్ మేళాల వారు సైతం ఇప్పటికే శ్రావణమాసం కారణంగా అరటి, పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. ముహూర్తాలు దగ్గర పడే కొద్దీ వీటి రేటు పెరుగుతుందని వ్యాపారులు అంచనా. -
కాంట్రాక్టర్ చెరలో టీటీడీ కల్యాణ మండపం
ఆదాయం రూ.లక్షల్లో.. టీటీడీకి చేరేది వేలల్లో విధులకు హాజరుకాని అధికారి రూ.లక్షలు గడిస్తున్న కాంట్రాక్టర్ నందిగామ, న్యూస్‌లైన్ : పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా నిర్మించిన టీటీడీ కల్యాణ మండపం అక్రమార్కుల చెరలో చిక్కుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నంది గామ టీటీడీ కల్యాణం మండపం నిర్వహణ బాధ్యతలు చూసే అధికారి, ఓ కాంట్రాక్టర్ కలిసి ఏటా రూ.50 లక్షల ఆదాయం పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్యాణ మండపాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన టీటీడీ దేవస్థానానికి మాత్రం వేలల్లోనే ఆదాయం అందుతోంది. పట్టణంలో రెండు దశాబ్దాల క్రితం టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించారు. అప్పట్లో కొంత కాలం దాని నిర్వహణ బాగుంది. ఆ తరువాత టీటీడీ అధికారులు మండపం నిర్వహణను లీజుకు ఇచ్చారు. లీజ్ ముగిసిన తరువాత నాలుగేళ్లు టీటీడీ ఆధ్వర్యంలోనే కల్యాణమండపం నడిచింది. దీని బాధ్యతలు చూసేందుకు ఓ అధికారిని నియమించారు. అయితే ఆ అధికారి కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ అధికారి నందిగామ వచ్చి ఏడాది గడిచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేద, మధ్య తరగతి వారు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అందుబాటులో ఉండేలా రోజుకు కేవలం రూ.1500 అద్దెకే కల్యాణ మండపాన్ని ఇచ్చేలా టీటీడీ దేవస్థానం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కల్యాణ మండపం బాధ్యతలు చూస్తున్న అధికారి రోజుకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారని అద్దెకు తీసుకున్నవారు ఆరోపిస్తున్నారు. శుభకార్యాల కోసం అద్దెకు తీసుకున్న వారు తమ స్థాయికి తగ్గట్టుగా విద్యుత్ దీపాలంకరణ, మండప అలంకరణలు చేసుకుం టారు. అయితే కాంట్రాక్టర్ మాత్రం ఈ అలంకరణ పేరిట లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. శాశ్వతంగా ఉండేలా విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాట్లు చేసున్న కాంట్రాక్టర్ ఇతర అలంకరణ కాంట్రాక్టర్లను ఇక్కడికి రానివ్వడంలేదు. ఈ కల్యాణమండపం బాధ్యతలు చూడాల్సిన అధికారి అద్దెకు తీసుకునేవారికి అందుబాటులో ఉండటంలేదు. కనీసం ఫోన్ నంబరు కూడా ఎవరికీ ఇవ్వడంలేదు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మండపాన్ని బుక్ చేసేందుకు ఆ అధికారిని సంప్రదించారు. అయితే ఆ అధికారి సూచనల మేరకు కాంట్రాక్టర్‌ను కలవగా ఆయన తన వద్దే ఉన్న బుకింగ్ రిజిస్ట్రర్ చూసి ఖాళీగా ఉందని రూ.13 వేలు ఇవ్వాలని కోరారు. రూ.13 వేలు చెల్లిం చిన పది రోజులు తరువాత కేవలం రూ.3వేలకు మాత్రమే రసీదు ఇచ్చారు. కల్యాణ మండపంలో పెళ్లికి అవసరమైన అన్ని రకాల అలంకరణలకు అయ్యే ఖర్చు రూ.లక్ష ఉంటుందని, అందుకు సిద్ధమైతేనే కల్యాణ మండపాన్ని అద్దెకు ఇస్తామని ఆ కాంట్రాక్టర్ స్పష్టంచేశాకరి అద్దెకు తీసుకున్న వ్యక్తి తెలిపారు. ఈ ఆరోపణలపై టీటీడీ నియమించిన అధికారి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆందుబాటులోకి రాలేదు.