చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు
-
ఆందోళనకు దిగిన గ్రామస్తులు
కాకినాడ క్రైం :
గొడారిగుంటలో చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా నగరపాలక సంస్థ ప్రణాళిక అధికారులు పోలీసులతో వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పాస్టర్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష¯ŒSకు తరలించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే...కొత్త కాకినాడ గొడారిగుంటలో సర్వే నంబర్ 42లో 2008 సంవత్సరంలో ముగ్గురు లబ్థిదారులకు చెరో 50 గజాలు వంతున పట్టాలిచ్చింది. ముగ్గురు లబ్థిదారుల్లో ఇద్దరు పాస్టర్ ఇసాకు ( మైలపల్లి సూరిబాబు), కుమారుడు సామ్యూల్ పేరుమీద పట్టా ఉంది. గత కొన్నేళ్లుగా పాకలో క్రీస్తు సువార్త సహవాస సంఘం (చర్చి)ని పాస్టర్ ఇసాకు నిర్వహిస్తున్నారు. దుండగులు పాక తగలబెట్టేయడంతో రేకులషెడ్డు నిర్మించాడు. ప్రస్తుతం పక్కా భవనం నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణం పనులు జరుగుతుండగా మంగళవారం టౌ¯ŒS ప్లానింగ్ అ«ధికారులు వచ్చి ప్లా¯ŒS మంజూరు లేదు, పైగా ఇది సామాజిక స్థలమని, నిర్మాణ ఆపాలని చెప్పి, మెటీరియల్‌ను తీసుకెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా ‘అధికారులతో మాట్లాడతాను నిర్మాణ పనులు చేసుకోండ’ని చెప్పడంతో పనులు చేపట్టామన్నారు. బుధవారం సాయంత్రం మళ్లీ అధికారులు టూటౌ¯ŒS పోలీస్‌లు, జేసీబీతో వచ్చి పునాదులను కూల్చేందుకు యత్నించగా, ప్రతిఘటించామని, వినకుండా పాస్టర్ ఇసాకును పోలీస్‌స్టేష¯ŒSకు తీసుకెళ్లిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ«ధ్యాత్మిక భావంతో చర్చి నడుపుతుంటే వర్గ వైషమ్యాలు తలెత్తేలా అధికారులు, పోలీస్‌లు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్‌ను విడిచిపెట్టేదాకా ఇక్కడ నుంచి కదిలేది లేదని చర్చికి చెందిన సుమారు 300 మంది ఆందోళనకు దిగారు. ఏ విషయంపై పాస్టర్‌ను పోలీçసులు అరెస్టు చేశారు? ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారనేది తేలా దాకా సంఘటనా స్థలం నుంచి కదలమని స్పష్టం చేశారు. టూటౌ¯ŒS సీఐ ఉమర్‌ని వివరణ కోరగా ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణ పనులు చేస్తున్నారని, పనులను ఆపాలని అధికారులిచ్చిన ఫిర్యాదుపై పనులు ఆపించామన్నారు.