ఈపూరు (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్లలోని జెఎంజి చర్చిలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. చర్చికు అనుబంధంగా విద్యార్థుల హాస్టల్ కూడా ఉంది. వేకువజామున దొంగలు పడి బీరువాను తీసుకెళ్లి పక్కనున్న పొలాల్లో పడేసి సుమారు రూ.3లక్షల రూపాయల నగదు, వస్తువులు దోచుకెళ్లారు. ఈ మేరకు చర్చి నిర్వాహకులు ఈపూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.