ఉదయించిన కరుణ.. హృదయ ఆలాపన
ఏసుండు జన్మించే రేయిలో... లాలీ లాలెమ్మ లాలీ... రక్షకుడు ఉదయించినాడు లోకమంతటా వెలుగు... వంటి కీర్తనలతో ఆదివారం ఉదయం నుంచి చర్చీ ప్రాంగణాలు మార్మోగాయి. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు గుండె నిండుగా చేసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నూతన వస్త్రాలు ధరించి చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఏసు జననం వృత్తాన్ని వివరించేలా ప్రార్థనా మందిరాల్లో పశువుల పాకను అలంకరించి ఊయలలో బాల ఏసును ఉంచి ప్రత్యేక పాటలు పాడారు. శనివారం అర్ధరాత్రి కేక్‌లను కట్ చేశారు. ఆయా చర్చీల్లో బిషప్‌లు, ఫాదర్‌లు ఏసు సందేశాన్ని వినిపించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు.