ముఠా సభ్యుడ్ని కాల్చి చంపిన గ్యాంగ్స్టర్ను గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటుచేసుకుంది.
మీరట్: ముఠా సభ్యుడ్ని హత్యచేసిన గ్యాంగ్స్టర్ను గ్రామస్తులు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం హతుడు హస్మత్ పాటు మరో ముగ్గురు ఒకహత్యకేసులో నిందితులు. ఆరునెలల క్రితం నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈమధ్యనే పోలీసుల కస్టడీనుంచి తప్పించుకున్న హస్మత్ తమ అరెస్టులకు కారణం షాబీర్ అని కక్ష పెంచుకున్నాడు. తన గ్యాంగ్ రహస్యాలను పోలీసులకు చేరవేస్తున్నాడనే కోపంతో, అనుమానంతో రగిలిపోయాడు. అంతే....షాబీర్ గ్రామం ఇంద్రిష్పూర్కి వెళ్లి అతినిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో షాబీర్ అక్కడిక్కడే చనిపోయాడు. కాల్పుల శబ్దం విన్నగ్రామస్తులు, విగతజీవిగా మారినషాబీర్ ను చూసి కోపోద్రిక్తులై హస్మత్ను చుట్టుముట్టి కట్టెలతో దారుణంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరేలోపే హస్మత్ ప్రాణాలొదిలాడు.