లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మోతీపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆపీసుపై మూకుమ్మడి దాడి చేసి, నిందితుడిని విడిపించుకుపోయిన ఘటన కలకలం రేపింది. ఫారెస్ట్ రేంజర్ సహా ఆరుగురిని సిబ్బందిని గాయపర్చిన దుండగులు, రేంజ్ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేశారు.
అటవీ అధికారుల సమాచారం ప్రకారం అడవిలోని చెట్లను అక్రమంగా నరికేస్తున్నాడనే ఆరోపణలపై సల్మాన్ అనే వ్యక్తిని అటవీశాక అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త విన్న కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా రేంజ్ ఆఫీసుపై దాడికి దిగారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దుండగులను నిరోధించడానికి ప్రయత్నించిన రేంజర్ ఖుర్షీద్ ఆలం, డిప్యూటీ రేంజర్ రామ్ సహా ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం లాకప్‌లో ఉన్న సల్మాన్ అక్కడి నుంచి తప్పించుకుని ఉడాయించారు. ఈ దాడిపై అటవీశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఫారెస్ట్ ఆఫీసుపై మూకుమ్మడి దాడి
Published Wed, Nov 4 2015 1:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM
Advertisement