మునిపల్లి : మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు డీ కొన్న సంఘటన మండలంలోని కంకోల్ శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీదర్‌కు చెందిన సంగమేశ్వర్, ఖలీల్‌హైమద్, శివానంద్‌లు కారులో హైదరాబాద్ నుంచి బీదర్‌కు వస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం కంకోల్ శివారులోకి రాగానే జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుదేరా ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
బస్సు, కారు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలు
Published Fri, Dec 19 2014 11:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement