
కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ బేగంపేట్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో గిరిధర్(45), అనిత(30), ప్రియ(15), మహేష్(2), డ్రైవర్ జగదీష్(30)లుగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హర్షవర్దన జిల్లా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక కలబురిగి జిల్లా గంగాపూర్ దైవదర్శనానికి వెళ్లిన క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: యువతి చేష్టలతో విమానంలో గందరగోళం