
బెంగళూరు: కాంగ్రెస్ తనను పదే పదే తిడుతోందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే ఆ పార్టీ నేతలు 91 సార్లు తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. కానీ తాను అవేం పట్టించుకోనని, ప్రజల కోసం మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. అలాగే తనను తిట్టిన ప్రతిసారి కాంగ్రెస్ ఘోర పరాభవం చవిచూస్తోందని మోదీ సెటైర్లు వేశారు.
కర్ణాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు మోదీ. ప్రధాని మోదీ విష సర్పం, తాకితే ఖతం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసిన వివర్శలకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. తనను తిట్టినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీని మరోసారి గెలిపించాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీకి 113 సీట్లు అవసరం.
చదవండి: రాజకీయాల్లో నటీనటులు