మంత్రి వ్యాఖ్యలతో కలకలం | TN minister Raju praises VK Sasikala, shocks EPS, OPS factions  | Sakshi
Sakshi News home page

మంత్రి వ్యాఖ్యలతో కలకలం

Published Sun, Oct 8 2017 6:06 PM | Last Updated on Mon, Oct 9 2017 12:57 AM

TN minister Raju praises VK Sasikala, shocks EPS, OPS factions 

సాక్షి,చెన్నై:తమిళనాడు మంత్రి సెల్లూర్‌ రాజు చేసిన వ్యాఖ్యలు పాలక ఏఐఏడీఎంకేలోని ఓపీఎస్‌, ఈపీఎస్‌ గ్రూపుల్లో కలకలం రేపాయి. అమ్మ(జయలలిత) ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు చిన్నమ్మ(శశికళ) కష్టపడి పనిచేశారని వ్యాఖ్యానించారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాడు సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న ఏఐఏడీఎంకేలోని ఇరు వర్గాలూ షాక్‌కు గురయ్యాయి. సీఎం పళనిస్వామికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మంత్రి రాజు చిన్నమ్మను పొగడటం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

అవినీతి కేసులో జైలు పాలయిన శశికళతో విభేదిస్తూ అత్యధిక ఎంఎల్‌ఏలను తమవైపు తిప్పుకోవడంలో పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంలు విజయం సాధించారు.అయితే మంత్రి వ్యాఖ్యలపై పళని, పన్నీర్‌ వర్గాలు ఇప్పటివరకూ నోరుమెదపలేదు. చెన్నైలో చికిత్స పొందుతున్న తన భర్తను పరామర్శించేందుకు పెరోల్‌పై శశికళ బయటకు వచ్చిన నేపథ్యంలో ఏఐఏడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు పెరోల్‌ సమయంలో చిన్నమ్మను కలిసేందుకు వెనుకాడబోనని మరో మంత్రి ఓఎస్‌ మణియన్‌ ఇటీవల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement