
చెన్నై: చిన్నమ్మ శశికళ సన్నిహితులు, వ్యాపారవేత్తల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో కొన్ని ఊహించని ప్రాంతాల్లో కూడా విలువైన వస్తువులు, బంగారం గుర్తించినట్టు రిపోర్టులు వస్తున్నాయి. సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో నగదు, డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. చెన్నైలోని 40 ప్రాంతాల్లో అధికారులు సోదా చేస్తున్నారు. శశికళ మేనకోడలు కృష్ణప్రియ నివాసంలోనూ అధారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా శశికళ అక్రమాస్తులు బయటపడుతున్నట్టు తెలిసింది. శశికళ పేరిట 10 బోగస్ కంపెనీలు ఉన్నాయని సమాచారం. నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్ కంపెనీల ద్వారా భారీగా లావాదేవీలు జరిగాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. శశికళ, ఆమె బంధువులకు చెందిన 317 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.
ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉందని... మొత్తం ఆపరేషన్ అయిన తర్వాత ఎంత మొత్తంలో నగదు, డాక్యుమెంట్లను సీజ్ చేశామో తెలుపుతామని ఓ ఐటీ అధికారి చెప్పారు. చాలా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ముగిసిందని, ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దినకరన్, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్, ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లలో, కార్యాలయాల్లో మూడు రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment