శశికళ, ఇళవరసి (ఫైల్)
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని శశికళ బంధుమి్రత్రులను జల్లెడపట్టిన ఐటీ అధికారులు ఇకబెంగళూరు బాటపట్టనున్నారు.అక్రమార్జనకు సూత్రధారి,కీలకపాత్రధారిగా భావిస్తున్నశశికళను బెంగళూరు జైల్లోనేవిచారించనున్నారు. అదే జైల్లోశిక్ష అనుభవిస్తున్న శశిబంధువులు ఇళవరసి,సుధాకరన్‌లను కూడావిచారణ పరిధిలోకితీసుకొస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మన్నారుగుడి మాఫియా’గా ముద్రపడిన శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈనెల 9 నుంచి 14వరకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో జరిపిన ఐటీ దాడుల్లో రూ.30వేల కోట్ల ఆస్తులు బయటపడడంతో అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. శశికళ అండ్ కోను హడలెత్తించారు. ఐటీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ వాహనాలకు పెళ్లి వేడుక స్టిక్కర్లు వేసుకుని 187చోట్ల ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించి కంగారు పుట్టించారు.
ప్రజల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేందుకు ఉపయోగపడుతున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికపై కూడా ఐటీ కొరడా ఝుళిపించింది. ఈ సందర్భంగా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా మరికొన్ని ముఖ్యమైన పత్రాలను శశికళ బంధువర్గం మాయం చేసిందని అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడులకు సంబంధించి శశికళ బంధువులతో విచారణ çపూర్తికావడానికి పదిరోజులపాటూ పట్టే అవకాశం ఉంది. కొడనాడు ఎస్టేట్‌లోని కొంతభాగాన్ని తనిఖీ చేయడం పూర్తికాగా, జయలలిత, శశికళల ప్రయివేటు గదుల తనిఖీలు ఇంకా మిగిలి ఉన్నాయి. అక్రమార్జనలో శశికళనే కీలకపాత్రధారిగా ఐటీ స్వాధీనం చేసుకున్న పత్రాలు రుజువు చేస్తున్నాయి.
పెరోల్‌లోనూ పెద్దనేరం
చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల ఐదురోజుల పెరోల్‌పై చెన్నైకి వచ్చారు. పెరోల్ రోజుల్లో బసచేసిన ఇల్లు, భర్త ఉన్న ఆస్పత్రి మినహా ఎక్కడికీ వెళ్లరాదని, ముఖ్యంగా పార్టీ నేతలను కలుసుకోరాదని జైళ్లశాఖ కఠినమైన నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే శశికళ ఐదు రోజులు పూర్తిచేసుకుని తిరిగి జైలుకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజుల కాలంలో 622 ఆస్తుల్లోనే పేర్లను తారుమారు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఆరు రోజులపాటూ జరిపిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా అధికారులు ఈమేరకు నిర్ధారించుకున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, తనిఖీల సమయంలో బయటపడిన అనేక సంస్థలకు శశికళతో సంబంధాలున్నట్లు తేలిందని తెలిపారు. ఈ కారణంగా శశికళను తప్పనిసరిగా విచారించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 622 ఆస్తుల మార్పిడి శశికళ బసచేసిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటిలోనే జరిగిందని భావిస్తున్నారు. శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసి, సుధాకరన్‌లను విచారించేందుకు చట్టపరంగా అనుమతి పొందుతామని, అలాగే బెంగళూరు పరప్పన అగ్రహార జైళ్ల శాఖకు ఉత్తరం రాస్తున్నామని తెలిపారు. రెండు లేదా మూడువారాల్లో అనుమతి లభిస్తుంది, విచారణ ప్రారంభిస్తామని అన్నారు.
ఆర్కే నగర్‌లా అసెంబ్లీ ఎన్నికలు
జయ ప్రాతినిథ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా రూ.89 కోట్లు ఖర్చుచేసి ఐటీకి దొరికిపోవడంతో ఎన్నికలు రద్దయ్యాయి. అప్పట్లో అదో సంచలనం. కాగా, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా చేసుకుని ఓటర్లకు భారీ ఎత్తున నగదు బట్వాడా జరిగినట్లుగా తాజా ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడం కలకలం రేపింది. అయితే ఆనాటి ఎన్నికలకు సార«థ్యం వహించిన జయలలిత జీవించి లేరు. అమ్మ వెనకాల అన్నీ తానై ఉండిన శశికళ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాలతో అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాన్ని కూడా శశికళ నుంచి రాబట్టే అవకాశం ఉంది.
ఐటీ దాడులు విఫలం : దివాకరన్
అట్టహాసంగా చేసిన ఐటీ దాడులు పూర్తిగా విఫలమని శశికళ సోదరుడు దివాకరన్ గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆరు రోజులుపాటు తనిఖీలు చేసినా అధికారులు తమ నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేక పోయారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment