బనశంకరి (బెంగళూరు): హిజబ్ వివాదంలో చిక్కుకున్న బెంగళూరు చంద్రా లేఔట్ విద్యాసాగర్ ప్రైవేటు స్కూల్ టీచర్ శశికళ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పాఠశాలలో పని చేయలేను, అనారోగ్యం వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. హిజబ్ ధరించిన విద్యార్థినులను స్కూల్లోకి అనుమతించలేదని ఇటీవల తల్లిదండ్రులు గొడవ చేశారు. హిజబ్‌కు వ్యతిరేకంగా శశికళ బోర్డుపై రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ తరుణంలో రాజీనామా చేశారు.
చదవండి: (ఆంగ్‌సాన్ సూకీపై విచారణ ఆరంభం)
Comments
Please login to add a commentAdd a comment