అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ, ఆమె బంధుమిత్రులపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు మెరుపుదాడులు నిర్వహించిన సంగతి పాఠకులకు విదితమే. ఈనెల 9వ తేదీ నుంచి ఆరురోజులు పాటు జరిగిన దాడుల సందర్భంగా రూ.1500 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.