దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరో వివాదాస్పద చిత్రాన్ని ప్రకటించారు. ప‍్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశికళ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. శశిలలిత పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా వెల్లడించారు. శశికళ.. జయలలితకు సేవకురాలిగా ఆమె జీవితంలోకి ప్రవేశించి రాజ్యాంగేతర శక్తిగా ఎలా ఎదిగారన్న ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించనున్నట్టుగా తెలిపారు.
యాదార్ధ సంఘటనల ఆధారాలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో శశికళ, జయలలిత జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి జయలలిత హాస్పిటల్ లో జరిగిన ప్రతి సంఘటనను ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగిన ప్రతి సంఘటన ఈ చిత్రం లో తెరకెక్కిస్తానని చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. అయితే కొందరు అనుకున్నట్టు శశికళ జీవితం ఆధారంగా సినిమా తీస్తే తమిళనాడుకు చెందిన శశికళ వర్గం అయిన మన్నర్ కుడి మాఫియా నా అంతుచూస్తారని బెదిరిస్తున్నారు అన్నారు.
గతంలో జయలలిత బ్రతికుండగానే జయలలిత ను తెలుగు భాష కు తమిళనాడు లో జరుగుతున్న అన్నాయం పై ఎదిరించటం జరిగిందని, అప్పుడే తనను ఏ శక్తి ఏమీ చేయలేక పోయిందన్నారు. జయలలిత మరణం వెనుక కుట్ర ఉందని శశికళ పై సుప్రీంకోర్టు లో కేసు వేసిన నాడే తనను ఏమీ చేయలేదని , ఒక లక్ష్యం తో పనిచేసే వారిని ఏ శక్తి అడ్డుకోలేదని కేతిరెడ్డి తెలిపారు . త్వరలోనే శశికళ, జయలలిత పాత్రలకు నటీమణుల ఎంపిక చేసి ప్రకటిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment