బెంగళూరు : కర్ణాటల హైకోర్టులో జయలలిత సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపు న్యాయవాదులు ఈరోజు ఉదయం పిటిషన్ వేశారు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ...ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జయలలిత తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు. ఆయన ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలిత సాదాసీదాగా గడిపారు. జయను వీఐపీల కోసం కేటాయించిన 23వ బ్యారెక్‌లో ఉంచారు.