జయలలిత బెయిల్ పిటీషన్పై వాదనలు పూర్తి
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటీషన్పై కర్ణాటక హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాసేపట్లో నిర్ణయం వెలువడనుంది. జయ మద్దతు దారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించారు. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు.
జయకు బెయిల్ వస్తుందని ఆమె మద్దతు దారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జయకు బెయిల్ రాకపోవచ్చని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతుండగా, మరికొందరు రావచ్చని చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.