చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో అప్పీల్ వివరాలు దాఖలు చేశారు. మొత్తం 667 పుస్తకాల్లో 2 లక్షల 15వేల పేజీల పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.100కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆమెకు అక్కడ ఊరట లభించింది.
బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షపై చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం స్టే విధించి జయకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ....ఈ కేసులో రెండు నెలల్లోగా అప్పీల్‌కు సంబంధించిన వివరాలను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఆ తర్వాత ఒక్క రోజు కూడా గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జయలలిత ...ఇవాళ అప్పీల్కు సంబంధించిన వివరాలు న్యాయస్థానంలో దాఖలు చేశారు.
667 పుస్తకాలతో కోర్టుకు అప్పీలు ..
Published Mon, Dec 8 2014 1:55 PM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM
Advertisement