
జయకు బెయిల్ రాకపోతే తమిళనాడు జైలుకు?
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలితను ఆమె సొంత రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఆమె కర్ణాటక జైలులోనే ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని నిఘా అధికారులు ఆదివారం సీఎం సిద్ధరామయ్యతో చెప్పినట్లు తెలిసింది. ‘‘జయను చూసేందుకు వేలాదిగా తమిళలు జైలు వద్దకు చేరుకుని గొడవ చేస్తున్నారు.
సుప్రీం కోర్టులో జయ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడా బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది’’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను తమిళనాడులోని జైలుకు తరలించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం.