సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు.
(చదవండి : అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?)
కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచే స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని ఆమె కోర్టు ద్వారా ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న బాబు.. అక్రమంగా వేలకోట్ల రూపాయలు సంపాదించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే, హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని బాబు తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు స్టే వివరాలను పరిశీలిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
(చదవండి : ఆదాయం వేలల్లో.. కోట్లు ఎలా సంపాదించారు?)
Comments
Please login to add a commentAdd a comment