
జయ బెయిల్ విచారణ వాయిదా
కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెంచ్‌కు కేసు అప్పగింత
బెంగళూరు/చెన్నై: ఆదాయూనికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణను కర్ణాటక హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. దీంతో, తన పిటిషన్ విచారణకోసం జయలలిత ఈ నెల 7వరకూ జైలులోనే ఉండాల్సిఉంటుంది. సహనిందితులైన జయు స్నేహితురాలు శశికళ, బంధు వు ఇళవరసి, దత్తపుత్రుడు సుధాకరన్ కూడా మరో 6 రోజులు జైలులోనే గడపక తప్పదు.
తన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయలని, బెయిల్ మంజూరు చేయూలని జయలలిత తన పిటిషన్‌లో కోర్టును కోరారు. బుధవారం ఉదయుం,. కట్టుదిట్టమైన భద్రత మధ్య జనంతో కిక్కిరిసిన హైకోర్టులో జయలలిత పిటిషన్‌ను, వెకేషన్ బెంచ్ సత్వర ప్రాతిపదికన పరిశీలించిం ది. ఐపీసీ 389వ సెక్షన్‌ప్రకారం జయులలిత జైలు శిక్షను సస్పెండ్ చేయూలని, బెయిల్‌పై విడుదల చేయూలని న్యాయువాది రాం జెఠ్మలానీ కోరారు. అరుుతే, జయ కోరినట్టుగా శిక్షను సస్పెండ్ చేస్తే, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆమె తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయువచ్చని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏఎస్‌పీ) భవానీ సింగ్ వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు న్యాయువుూర్తి జస్టిస్ రత్నకళ, విచారణను రెగ్యులర్ బెంచ్‌కు అప్పగిస్తూ ఈ నెల 7వ తేదీకి వారుుదా వేశారు. జయు పిటిషన్‌పై హైకోర్టు విచారణకు సంబంధించి ఎస్‌ఎస్‌పీగా తనను నియుమిస్తూ జారీ అరుున మెమోను భవానీ సింగ్ అంతకు వుుందు కోర్టుకు సమర్పించారు. బెయిల్‌పై విచారణ మరోసారి వారుుదాతో అన్నా డీఎంకే మద్దతుదార్లు, కొందరు న్యాయువాదులు కోర్టు బయట అసంతృప్తి, ఆందోళన వ్యక్తంచేయగా, పోలీసులు వారిని అదుపుచేశారు. కాగా, అన్నా డీఎంకే అధినేత్రి జయకు సంఘీభావంగా తమిళనాడులో ఐదవరోజూ నిరసనలు కొనసాగాయి.
జయకు స్వల్ప అస్వస్థత
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయలలిత బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్‌వాక్ అనంతరం ఆమె పత్రికలు చదువుతుండగా బీపీ పడిపోవడంతో జైలు అధికారి దివ్యశ్రీ వైద్య పరీక్షలు చేయించారు. మందులు వాడాక జయుకు ఉపశమనం కలిగింది. తర్వాత, తన సహాయకుడు వీర పెరుమాళ్ తెచ్చిన ఇడ్లీ, పొంగల్‌ను జయ ఆహారంగా తీసుకున్నారు. బుధవారం ఆమె ఎవరినీ కలవలేదు. మరోవైపు, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న అభిమానులు జయులలిత దర్శనం కోసం జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.