
నేను ఆ తీర్పును చూడలేదు!
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కోర్టు దోషిగా తేల్చిన అంశానికి సంబంధించి మాట్లాడానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తిరస్కరించారు. 18 ఏళ్ల నాటి కేసులో జయలలితకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేస్తూ బెంగళూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాజ్ నాథ్ సింగ్ దాటవేత ధోరణి అవలంభించారు.'నేను ఆ తీర్పుకు సంబంధించి ఎటువంటి కామెంట్ చేయలేను. ఆ తీర్పును నేను ఇంతవరకూ చూడలేదు'అని తెలిపారు.
1991 నుంచి 1996 వరకూ జయలలిత సీఎంగా ఉన్న మధ్యకాలంలో రూ. 66. 65కోట్ల అక్రమాస్తులను కూడగట్టారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది.