జయ బెయిల్ పిటిషన్‌పై 17న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. పిటిషన్‌ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మన్నించింది.
దీపావళికి ముందు జైల్లోంచి బయటకు రావాలంటే ఈ నెల 17(శుక్రవారం) జయకు చివరి అవకాశం. జయలలితను తమినాడుకు పంపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల ద్వారా కోరితే తరలించడానికి తమకు అభ్యంతరం లేదని కర్ణాటక హోం మంత్రి కేజీ జార్జి చెప్పారు.