
కేసు విచారణ ఖర్చు రూ.5 కోట్లు!
చెన్నై: జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. ఒక్క కర్ణాటక ప్రభుత్వమే జయ కేసు విచారణకు సుమారు రూ. 2.5 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు గడించారంటూ జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్‌పై కేసులు నమోదవడం తెలిసిందే.
ఈ కేసులకు సంబంధించి 18 ఏళ్లుగా కోర్టుల్లో విచారణ సాగుతోంది. తొలుత మద్రాసు హైకోర్టులో విచారణ సాగింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే మళ్లీ అధికారం చేపట్టడంతో కేసు నీరుగారుతుందనే భావన వ్యక్తమైంది. దీంతో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ దాఖలు చేసిన పిటిషన్‌తో కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టుకు చేరింది.