
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ‘ఆదిపురుష్’ పోస్టర్లతో నిండిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతుండటంతో.. చివరి దశ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఆదిపురుష్ టీమ్ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ ప్రకటన చేసింది. ఆదిపురుష్ స్క్రీనింగ్ సమయంలో ప్రతి థియేటర్‌లో ఒక సీటు అమ్ముడుపోదు.. ఆ సీటులో ఎవరూ కూర్చోకూడదని మేకర్స్ చెప్పారు. ప్రజల విశ్వాసాలను కాపాడేందకు ఆ సీటును రామ భక్తుడు హనుమంతునికి అంకితం చేయబడుతుందని వారు పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్'!)
అంతే కాకుండా వారు ఇలా ప్రకటించారు. "రామాయణం ఎక్కడ పఠించినా హనుమంతుడు కనిపిస్తాడు. ఇది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ని ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటు అమ్మకుండా హనుమంతుడికి రిజర్వ్ చేయబడుతుంది. రాముని గొప్ప భక్తుడు హనుమంతుడి గురించి జూన్ 16న అందరూ తెలుసుకోండి.'' అని యూనిట్ తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడ ఐదు భాషల్లో ‘ఆదిపురుష్’ తెరపైకి రానుంది. చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్6)న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరగనుంది.
(ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా: నటి)
Comments
Please login to add a commentAdd a comment