రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి దర్శకుడు ఓంరౌత్ 'ఆదిపురుష్' తెరకెక్కించాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తున్న సంగతే తెలసిందే. శ్రీరాముడి తండ్రి దశరథుడు పాత్రలో కూడా ప్రభాస్ నటించారని ప్రచారం జరుగుతుంది. కొడుకుగా రాముడి పాత్రలో కనిపిస్తూనే, మొదటి కొంతసేపు తండ్రిగా దశరథుడు పాత్రలో కూడా ప్రభాస్ కనిపించి అలరించాడని, ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా టీజర్ విడుదల సమయంలో VFX పట్ల మేకర్స్‌పై భారీ ట్రోలింగ్ దెబ్బ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీలో కొన్ని చోట్ల VFX సూపర్ అంటున్నారు.
(ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విటర్ రివ్యూ)
తెలంగాణలో ఆరు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 4 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్‌లో షో వెశారు. అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడ మొత్తం ఆరు స్క్రీన్స్‌లోనూ బెనిఫిట్ షోలు వేశారు. ‘ఆదిపురుష్’ మంచి విజయం అందుకోవాలని టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment