Hero Teja Sajja Have No Doop In Movie, Hanuman Movie Team Says - Sakshi
Sakshi News home page

Teja Sajja Hanuman Movie: నో డూప్‌, ఎనిమిది గంటల పాటు తాడు పైనే!

Published Fri, Mar 18 2022 9:27 AM | Last Updated on Fri, Mar 18 2022 10:21 AM

Hanuman Movie Team Said Hero Teja Sajja Have No Doop In Movie - Sakshi

Hero Teja Sajja Hanuman Movie: తేజ సజ్జ, అమృతా అయ్యర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘హను మాన్‌’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ 100వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మొదటి పాన్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో చిత్రం ‘హను మాన్‌’ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది.

చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్‌ ట్వీట్‌, అంత మాట అనేశాడేంటి!

సూపర్‌ హీరో సినిమాల్లో అధికంగా యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. ఈ సినిమాలోనూ అలాంటివి ఉన్నాయి. అయినా హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా షూట్‌ చేస్తున్నాం. తేజ సజ్జ చాలా రోజులుగా వరుసగా 8 గంటల పాటు రోప్‌పై ఉండాల్సి వస్తోంది’’ అన్నారు. కాగా ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement