
కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. తొలి అడుగులోనే ‘అ!’ లాంటి వైవిధ్యభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన హనుమాన్ టీజర్‌తో ఓ రేంజ్ అద్భుతాన్ని సృష్టించారు. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
అయితే తాజాగా ఓ విషయంలో ప్రశాంత్ వర్మ క్షమాపణలు కోరారు. రామాయణాన్ని పురాణం అన్నందుకు దయచేసి క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్వీట్‌లో ప్రశాంత్ వర్మ రాస్తూ..'నా ప్రసంగంలో ‘పురాణం’ అనే పదాన్ని ఉపయోగించినందుకు దయచేసి క్షమించండి. రామాయణం మన చరిత్ర' అంటూ పోస్ట్ చేశారు. కాగా..జాంబి రెడ్డి మూవీ తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా 'హనుమాన్'. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌తో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
Please pardon me for using the word ‘Mythology’ in my speech! Rāmāyana is our ‘History’! #JaiShreeRam 🙏🏼
— Prasanth Varma (@PrasanthVarma) November 26, 2022