చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలకి వచ్చిన పలు సినిమాల్లో నటించిన తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 'హనుమాన్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)
ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడుతూ చిత్రబృందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళ వెర్షన్ నిర్మాత చైతన్య మాట్లాడుతూ.. 'హనుమాన్' కోసం అందరూ ఎంతగానో శ్రమించారు. చిత్రం చాలా బాగా వచ్చింది. చిన్న ప్రయత్నంగా ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా అయింది. హనుమాన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేస్తున్న శక్తిఫిలింస్ అధినేత శక్తివేల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎవరూ ఊహించనంత బ్రహ్మాండంగా 'హనుమాన్' వచ్చిందని చెప్పారు. ఇందులో తనతో పాటు సముద్రఖని, అమృతా అయ్యర్ ఇలా చాలామంది తమిళ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. హనుమాన్ చిత్రం వెనుక చాలా శ్రమ ఉందని హీరో తేజా పేర్కొన్నాడు. ఇది తెలుగు చిత్రంగా కాకుండా డైరెక్ట్ తమిళ చిత్రంగా ఉంటుందన్నారు. అందుకోసం చాలా శ్రమించామని చెప్పారు.
(ఇదీ చదవండి: రిలీజ్ గందరగోళం.. ఇప్పుడేమో సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ)
Comments
Please login to add a commentAdd a comment