టాలీవుడ్‌లో ఫాంటసీ కథలతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసే చిత్రాల్లో రాజమౌళి ఫెర్ఫెక్ట్. మిగతా దర్శకులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. ప్రేక్షకులతో తిట్లు తింటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరూ ఓ సినిమా కోసం కాస్తంత ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ 'హనుమాన్'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
సంక్రాంతి రేసులో
హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోల సినిమాలు చూసి మనం ఆహో ఓహో అంటుంటాం. వాళ్లందరికీ గురువు లాంటివాడు ఆంజనేయుడు. ఆయన కథతో ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. గ్రాఫిక్స్ ప్రధానం కావడం వల్ల గత రెండేళ్ల నుంచి ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఏదో తొందరపడి విడుదల చేయాలని కాకుండా నిదానంగా ఒక్కో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన‍్ని థియేటర్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ)
ఏకంగా అన్ని సినిమాలు?
వచ్చే సంక్రాంతి బరిలో ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు బోలెడన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మహేశ్ 'గుంటూరు కారం', రవితేజ 'ఈగిల్' ముగ్గుల పండక్కే వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటితోపాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ, పవన్ కల్యాణ్ 'ఓజీ', చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కాంబోలోని సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
'హనుమాన్' స్పెషల్
ప్రశాంత్ వర్మ తీస్తున్న 'హనుమాన్' సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా 11 భాషల్లో విడుదల చేయబోతున్న తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇందులో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్. వరలక్ష‍్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేస్తోంది. ఇలా సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్న ఈ చిత్రం.. సంక్రాంతికి మిగతా సినిమాలతో కలిసి బరిలోకి దిగుతుందా? లేదా ప్లాన్ ఏమైనా మార్చుకుంటుందా అనేది చూడాలి.
— Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023
(ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment